LIC public notice: ‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్‌ఐసీ అలర్ట్‌!

తమ బ్రాండ్‌ పేరు, లోగోతో కొందరు సామాజిక మాధ్యమాల్లో తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇస్తున్నారని, వీటితో అప్రమత్తంగా ఉండాలని ఎల్‌ఐసీ సూచించింది.

Updated : 24 Apr 2024 18:47 IST

LIC | దిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC) బుధవారం పబ్లిక్‌ నోటీసు జారీ చేసింది. ఎల్‌ఐసీతో పాటు, సంస్థకు చెందిన వ్యక్తుల పేరుతో వివిధ సామజిక మాధ్యమ ఖాతాల్లో మోసపూరిత ప్రకటనలు వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. ఇలాంటి ప్రకటనలపై ప్రజలు, పాలసీదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టింది.

‘‘కొంతమంది వ్యక్తులు/ సంస్థలు మా సంస్థ పేరుతో వివిధ సోషల్‌మీడియా వేదికల్లో మోసపూరిత ప్రకటనలు ఇస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. అనధికారికంగా ఎల్‌ఐసీకి చెందిన సీనియర్‌ అధికారులు, మాజీ ఉద్యోగుల చిత్రాలు, బ్రాండ్‌ నేమ్‌, లోగోను వినియోగిస్తున్నట్లు తెలిసింది. ఇలాంటి మోసపూరిత కార్యకలాపాలతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు, పాలసీదారులకు సూచిస్తున్నాం’’ అని ఎల్‌ఐసీ తన పబ్లిక్‌ నోటీసులో పేర్కొంది. ఈతరహా ప్రకటనలను గుర్తిస్తే వెంటనే ఎల్‌ఐసీ అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా యూఆర్‌ఎల్స్‌ పంపాలని సూచించింది. అలాంటివారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపింది. అధీకృత సమాచారం కోసం నేరుగా తమనే సంప్రదించాలని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని