LIC Q4 results: ఎల్‌ఐసీ లాభం రూ.13,763 కోట్లు.. ఒక్కో షేరుపై ₹6 డివిడెండ్‌

LIC q4 results: ఎల్‌ఐసీ త్రైమాసిక ఫలితాలను వెలువరించింది. ఒక్కో షేరుపై రూ.6 చొప్పున డివిడెండ్‌ కూడా ప్రకటించింది.

Published : 27 May 2024 20:28 IST

LIC Q4 results | దిల్లీ: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ త్రైమాసిక ఫలితాలను (LIC Q4 results) ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఈ సంస్థ రూ.13,763 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.13,428 కోట్లతో పోలిస్తే నికర లాభంలో 2 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం ఆదాయం సైతం రూ.2,00,185 కోట్ల నుంచి రూ.2,50,923 కోట్లకు పెరిగినట్లు ఎల్‌ఐసీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

సమీక్షా త్రైమాసికంలో తొలి ఏడాది ప్రీమియం వసూళ్లు రూ.13,810 కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయంలో ఈ మొత్తం రూ.12,811 కోట్లుగా ఉంది. రెన్యువల్‌ ప్రీమియంల ద్వారా వచ్చే ఆదాయం రూ.76,009 కోట్ల నుంచి రూ.77,368 కోట్లకు పెరిగింది. 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఎల్‌ఐసీ 40,676 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. తుది డివిడెండ్‌ కింద ఒక్కో షేరుకు రూ.6 చొప్పున ఇచ్చేందుకు కంపెనీ బోర్డు నిర్ణయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని