Land T Finance: గృహోపకరణాల కొనుగోలుకూ రుణం: ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌

గృహరుణంతో పాటు, గృహోపకరణాల వంటివి కొనుగోలు చేసుకునేందుకు రుణాన్ని ఇచ్చేలా ‘కంప్లీట్‌ హోం లోన్‌’ పథకాన్ని తీసుకొచ్చినట్లు ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ వెల్లడించింది.

Published : 30 May 2024 03:33 IST

ఈనాడు, హైదరాబాద్‌: గృహరుణంతో పాటు, గృహోపకరణాల వంటివి కొనుగోలు చేసుకునేందుకు రుణాన్ని ఇచ్చేలా ‘కంప్లీట్‌ హోం లోన్‌’ పథకాన్ని తీసుకొచ్చినట్లు ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ వెల్లడించింది. గృహరుణం కింద గరిష్ఠంగా రూ.5 కోట్లు ఇస్తున్నందున, అందులో 15% (గరిష్ఠంగా రూ.75 లక్షల) వరకు గృహోపకరణాల కొనుగోలుకు ఇస్తామని సంస్థ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సంజయ్‌ గర్యాలీ బుధవారం ఇక్కడ తెలిపారు. వినియోగదారులు సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడంతో పాటు, కొత్త ఇంటిలోకి అవసరమైన వస్తువులను సమకూర్చుకునేందుకు ఇది తోడ్పడుతుందన్నారు. గరిష్ఠంగా పదేళ్ల వ్యవధికి 10.75-11 శాతానికి ఈ రుణం అందుబాటులో ఉంటుందన్నారు. తమ మొత్తం రుణాలు రూ.80,037 కోట్లుగా ఉన్నాయని, ఇందులో రూ.18,443 కోట్ల వరకు గృహరుణాలు ఉన్నాయన్నారు. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలలో గృహరుణాలు ఇస్తున్నామని, రిటైల్‌ రుణాలు మారుమూల పల్లెలకూ విస్తరించాయని పేర్కొన్నారు. ద్విచక్ర విద్యుత్‌ వాహనాలకూ రుణాలు ఇస్తున్నట్లు వెల్లడించారు. గృహరుణాలకు 8.65% వడ్డీ వసూలు చేస్తున్నామని వివరించారు. ఏటా గృహరుణాల మార్కెట్‌లో 25-30% వృద్ధి సాధిస్తున్నట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు