Commercial partnership: వాణిజ్య భాగస్వామ్యాల్లో లోటే ఎక్కువ

మన దేశం నుంచి వివిధ దేశాలకు ఎగుమతులు, అక్కడి నుంచి దిగుమతులు జరుగుతుంటాయి. మన ఎగుమతుల బిల్లు కంటే, దిగుమతుల బిల్లు అధికంగా ఉంటే, మన దేశానికి వాణిజ్య లోటుగా పరిగణించాలి.

Published : 27 May 2024 03:07 IST

దిల్లీ: మన దేశం నుంచి వివిధ దేశాలకు ఎగుమతులు, అక్కడి నుంచి దిగుమతులు జరుగుతుంటాయి. మన ఎగుమతుల బిల్లు కంటే, దిగుమతుల బిల్లు అధికంగా ఉంటే, మన దేశానికి వాణిజ్య లోటుగా పరిగణించాలి. అదే మన ఎగుమతులు అధికంగా ఉండి, దిగుమతులు తక్కువగా ఉంటే, మనకు వాణిజ్య మిగులు లభించినట్లు. మనదేశంతో వాణిజ్య లావాదేవీలు అధికంగా నెరపే 10 దేశాలతో చూసుకుంటే, తొమ్మిది దేశాలతో మన దేశానికి వాణిజ్య లోటు నమోదవుతోంది. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో అమెరికా-భారత్‌ మధ్య 118.28 బిలియన్‌ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం నమోదు కాగా, మనకు వాణిజ్య మిగులు 36.74 బిలియన్‌ డాలర్లుగా ఉండటం గమనార్హం. చైనా, రష్యా, సింగపూర్, కొరియా సహా 9 దేశాలతో మనకు వాణిజ్య లోటే నమోదైంది. 2022-23తో పోలిస్తే చైనా, రష్యా, కొరియా, హాంకాంగ్‌లతో మనకు వాణిజ్య లోటు పెరిగింది. యూఏఈ, సౌదీ అరేబియా, ఇండోనేషియా, ఇరాక్‌లతో వాణిజ్య లోటు తగ్గింది. ః 2023-24లో మన దేశానికి అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా కొనసాగింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక 118.4 బి.డాలర్లుగా నమోదైంది. తర్వాత స్థానంలో అమెరికా నిలిచింది. 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాల్లో ద్వైపాక్షిక వాణిజ్యంలో అమెరికా అగ్ర స్థానంలో ఉండేది. యూకే, బెల్జియం, ఇటలీ, ఫ్రాన్స్, బంగ్లాదేశ్‌లతో కూడా మన దేశానికి వాణిజ్య మిగులు ఉంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని