Ghazal Alagh: ఆ విషయాలు నా పిల్లల నుంచే నేర్చుకున్నా.. మామా ఎర్త్‌ సీఈఓ

Ghazal Alagh: పిల్లల నుంచి తాను నేర్చుకున్న పాఠాలను ‘ఎక్స్‌’ వేదికగా పంచుకున్నారు మామాఎర్త్‌ సీఈఓ గజల్‌ అలఘ్‌.

Published : 01 Jun 2024 00:14 IST

Ghazal Alagh | ఇంటర్నెట్‌డెస్క్‌: ఏదైనా పనిచేస్తున్నప్పుడు దగ్గరకొచ్చి.. ఎందుకిలానే చేయాలి? ఏమిటి ప్రయోజనం? అంటూ రకరకాల ప్రశ్నలు వేస్తుంటారు చిన్నారులు. చిన్న పని చేసినా తెగ సంబరపడిపోతుంటారు. ఇలాంటి విషయాలన్నీ మనం చిన్నపిల్లల చేష్టల్లో గమనిస్తూ ఉంటాం. ఇవే మనకు ఎన్నో పాఠాలు నేర్పుతాయి. ఇలా తన పిల్లల దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపారు బ్యూటీ బ్రాండ్ మామాఎర్త్‌ (Mamaearth) సహ-వ్యవస్థాపకురాలు, సీఈఓ గజల్ అలఘ్‌ (Ghazal Alagh). తరచూ సోషల్‌మీడియా వేదికగా తన ఆలోచనల్ని, అభిప్రాయాల్ని పంచుకొనే ఆమె.. తాజాగా తన పిల్లల నుంచి నేర్చుకున్న విషయాలను తన ఫాలోవర్లతో పంచుకున్నారు.

  •  ప్రతీ చిన్న విషయంలోనూ ఆనందాన్ని వెతుక్కోవడం.
  •  ఇతరుల పట్ల ముందుగానే ఒక అభిప్రాయానికి రాకుండా వాళ్లను యాక్సెప్ట్‌ చేయడం.
  •  శరీరానికి ఏది అవసరమో తెలుసుకోవడం.
  •  కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి.
  •  ప్రశ్నించడం.

ఇంగ్లాండ్‌ నుంచి భారత్‌కు లక్ష కిలోల బంగారం తరలింపు

మీ ఇంట్లో పిల్లలు ఉంటే మీ జీవితంలో ఒక మెంటార్‌ ఉన్నట్లేనని అలఘ్‌ తెలిపారు. పిల్లలు ప్రతీ విషయంలోనూ మనల్ని ఆశ్చర్యపరుస్తుంటారు అని పేర్కొన్నా. అలఘ్‌ పోస్టుపై నెటిజన్లు తమ అభిప్రాయాల్ని పంచుకున్నారు. తాము కూడా పిల్లల నుంచి నేర్చుకున్న విషయాలను కామెంట్ల రూపంలో తెలిపారు. ‘ప్రతీ పనినీ ఎంజాయ్‌ చేయడం వారి వద్దే నేర్చుకున్నా’ అని ఓ యూజర్‌ కామెంట్‌ చేశాడు. ‘అనుకున్నది సాధించడానికి నూరు శాతం కృషి చేయాలని వారి నుంచే నేర్చుకున్నా. వాళ్లు కోరుకున్న బొమ్మను కొనిచ్చేంతవరకు ప్రయత్నాన్ని అస్సలు మానరు కదా.. అలానే’’ అంటూ మరో యూజర్‌ తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని