Stock Market: ‘బేర్‌’మన్న మార్కెట్‌.. నష్టాలతో ముగిసిన సూచీలు

Stock Market Closing Bell: సోమవారం నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 600 పాయింట్లకు పైగా పతనమైంది. నిఫ్టీ 22,350 దిగువన స్థిరపడింది.

Published : 11 Mar 2024 15:58 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు సోమవారం భారీ నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలకు తోడు, దేశీయంగా కీలక రంగాల షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలు సూచీల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా సూచీలు పతనమయ్యాయి. సెన్సెక్స్‌ (Sensex) 600 పాయింట్లకు పైగా దిగజారగా.. నిఫ్టీ (Nifty) 22,350 మార్క్‌ దిగువకు పడిపోయింది.

ఈ ఉదయం 74,175.93 వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైన సెన్సెక్స్‌ (BSE) రోజంతా నష్టాల్లోనే సాగింది. ఒక దశలో 73,433 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరకు 616.75 పాయింట్లు కోల్పోయి 73,502.64 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ (NSE) కూడా 160.90 పాయింట్ల తగ్గి 22,332.65 వద్ద స్థిరపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 8 పైసలు క్షీణించి 82.75 వద్ద ముగిసింది.

నిఫ్టీలో టాటా కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, టాటా స్టీల్‌, బజాజ్‌ ఆటో, ఎస్‌బీఐ షేర్లు భారీగా నష్టపోయాయి. అపోలో హాస్పిటల్స్‌, నెస్లే ఇండియా, సిప్లా, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు కాస్త రాణించాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు కుదేలయ్యాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, చమురు, బ్యాంకింగ్‌, ఐటీ, రియల్టీ, లోహ, విద్యుత్‌ రంగాల సూచీలు 0.5 నుంచి 1 శాతం మేర కుంగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని