Maruti Suzuki: పునరుత్పాదక ఇంధనం కోసం రూ.450 కోట్ల పెట్టుబడి

పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల కోసం మారుతీ సుజుకీ రూ.450 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.

Published : 05 Jun 2024 20:12 IST

దిల్లీ: మారుతీ సుజుకీ తన పునరుత్పాదక ఇంధన వ్యూహంలో భాగంగా హరియాణాలోని తన మనేసర్‌ ప్లాంట్‌లోని బయోగ్యాస్‌ కేంద్రంలో ఆహార వ్యర్థాలు, నేపియర్‌ గడ్డిని ఉపయోగించి కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి వచ్చే మూడేళ్లలో సోలార్‌ పవర్‌, బయోగ్యాస్‌ వంటి పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల కోసం రూ.450 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు బుధవారం ప్రకటించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు రూ.120.80 కోట్లు కేటాయించింది. మారుతీ 2031 సంవత్సరం నాటికి వాహన ఉత్పత్తి సామర్థ్యాన్ని 40 లక్షల యూనిట్లకు పెంచాలని భావిస్తోంది. ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని