Meta Layoffs: మెటాలో మరోసారి భారీగా ఉద్యోగుల తొలగింపు?

Meta Layoffs: మెటాకు వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గింది. దీంతో ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడం కష్టతరంగా మారింది. దీంతో వ్యయ నియంత్రణ చర్యలు అనివార్యమయ్యాయి.

Published : 07 Mar 2023 10:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మాతృసంస్థ మెటా (Meta) మరింత మంది ఉద్యోగులను తొలగించే (Layoffs) యోచనలో ఉన్నట్లు సమాచారం. బహుశా వచ్చే వారంలోనే సదరు ఉద్యోగులకు సమాచారాన్ని అందజేసే అవకాశం ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. నవంబరులోనే మెటా (Meta) 11,000 మందిని తొలగించిన విషయం తెలిసిందే.

భారీ ఎత్తున సిబ్బందిని తగ్గించుకునే యోచనలో మెటా (Meta) ఉన్నట్లు తెలుస్తోంది. అవసరం లేని బృందాలన్నింటినీ తొలగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఫలితంగా మరోసారి వేలాది మంది ఉద్యోగులు ఇంటిబాట పట్టక తప్పదని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో మెటాకు వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గింది. దీంతో ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడం కష్టతరంగా మారింది. దీంతో వ్యయ నియంత్రణ చర్యలు అనివార్యమయ్యాయి. అందులో భాగంగానే ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటోంది.

మరోవైపు వర్చువల్‌ రియాలిటీ వేదిక మెటావర్స్‌పై మెటా భారీ ఎత్తున ఖర్చు చేస్తోంది. దీని పరిశోధన, అభివృద్ధిపై పెద్ద ఎత్తున ఆర్థిక వనరులను వెచ్చిస్తోంది. దీని నుంచి ఆదాయం రాబట్టుకోవడానికి ఇంకా సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత వనరులను జాగ్రత్తగా వినియోగించుకొనేందుకు ఖర్చులను తగ్గించుకుంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని