EV Charging: కలిసి పనిచేయనున్న MG మోటార్‌, HPCL

దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాల ఛార్జింగ్‌ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (HPCL)తో కలిసి పనిచేయనున్నట్లు MG మోటార్‌ ఇండియా తెలిపింది.

Published : 29 May 2024 18:48 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాల ఛార్జింగ్‌ మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (HPCL)తో చేతులు కలిపినట్లు ప్రముఖ వాహన తయారీ సంస్థ MG మోటార్‌ ఇండియా బుధవారం తెలిపింది. ఈ భాగస్వామ్యం ప్రకారం MG, HPCL కలిసి భారత్‌లోని హైవేలు, నగరాలను కవర్‌ చేసే కీలక ప్రదేశాలలో 50KW/60KW DC ఫాస్ట్‌ ఛార్జర్లను ఇన్‌స్టాల్‌ చేయనున్నాయని MG Motor India ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ భాగస్వామ్యం.. ఎలక్ట్రిక్‌ వాహన వినియోగదారులకు వారి సుదూర, ఇంటర్‌సిటీ ప్రయాణాల సమయంలో EV ఛార్జర్ల లభ్యతను పెంచడం ద్వారా వారి ప్రయాణ సౌలభ్యతపై పెంచనున్నాయి. హెచ్‌పీసీఎల్‌కు దేశంలో ఉన్న 22 వేల విస్తారమైన ఇంధన స్టేషన్ల నెట్‌వర్క్‌ కూడా ఇందుకు దోహదపడుతుందని MG Motor India చీఫ్‌ గ్రోత్‌ ఆఫీసర్‌ గౌరవ్‌ గుప్తా తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి 5 వేల EV ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయాలని హెచ్‌పీసీఎల్‌ లక్ష్యంగా పెట్టుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు