Microsoft: మైక్రోసాఫ్ట్‌లో ఈసారి వేతన పెంపుల్లేవ్‌..!

Microsoft: ఖర్చులను నియంత్రించడంలో భాగంగా మైక్రోసాఫ్ట్‌ ఈ ఏడాది కొంతమంది ఉద్యోగులకు వేతనం పెంచడం లేదని సమాచారం.

Published : 11 May 2023 13:57 IST

వాషింగ్టన్‌: పూర్తిస్థాయి శాశ్వత ఉద్యోగులకు ఈ ఏడాది వేతన పెంపులు లేవని టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ (Microsoft) తెలిపినట్లు సమాచారం. ఈ మేరకు ఇటీవల సీఈఓ సత్య నాదెళ్ల (Satya Nadella) ఉద్యోగులకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. 

ఆర్థిక పరిస్థితులు అస్థిరంగా ఉన్న నేపథ్యంలో గత ఏడాది తరహాలో ఈసారి పరిహారాల కోసం పెద్ద ఎత్తున బడ్జెట్‌ కేటాయించలేకపోతున్నామని నాదెళ్ల (Satya Nadella) తెలిపినట్లు ‘ఇన్‌సైడర్‌’ పత్రిక పేర్కొంది. ఈ నేపథ్యంలో వేతన పెంపును నిలిపివేయడంతో పాటు బోనస్‌లు, స్టాక్‌ రివార్డులకు తక్కువ నిధులు కేటాయించనున్నట్లు ఉద్యోగులకు ఆయన తెలియజేశారని సమాచారం. 

కంపెనీ నిర్ణయంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వేతన పెంపు లేకపోవడం ఉద్యోగులకు ఎదురుదెబ్బ అని ఓ ఉద్యోగి సామాజిక మాధ్యమం వేదికగా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు