జనవరిలో పెరిగిన దేశీయ ఖనిజ ఉత్పత్తి

భారతదేశ ఖనిజ ఉత్పత్తి 2024 జనవరిలో దాదాపు 6% పెరిగింది. పెరిగిన విద్యుత్‌ డిమాండ్‌ కారణంగా బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పెరిగింది.

Published : 20 Mar 2024 18:33 IST

దిల్లీ: భారత ఖనిజ ఉత్పత్తి 2024 జనవరిలో దాదాపు 6% పెరిగింది. ప్రపంచంలోని రెండో అతిపెద్ద బొగ్గు వినియోగదారు అయిన భారత్‌ జనవరిలో రికార్డు స్థాయిలో బొగ్గును ఉత్పత్తి చేసింది. పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌ కారణంగా విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు బొగ్గు, ఇతర శిలాజ ఇంధనాల వినియోగానికి పెద్ద కోత విధించలేదు. గతేడాదితో పోలిస్తే మైనింగ్‌, క్వారీల ద్వారా భారత్‌ ఖనిజ ఉత్పత్తి ఈ ఏడాది 5.90% వృద్ధి చెందిందని ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (PIB) బుధవారం తెలిపింది.

ఈ నివేదిక ప్రకారం.. పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌ కారణంగా దేశంలో ఈ ఏడాది 99.80 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి అయింది. ఉక్కుకు డిమాండ్‌ పెరగడంతో దాని ఉత్పత్తిలో కీలక ముడి పదార్థాలు అయిన ఇనుప ఖనిజం, ఇతర ఖనిజాలకు డిమాండ్‌ బాగా పెరిగింది. సింథటిక్‌ రబ్బర్‌ను తయారు చేయడానికి ఉపయోగించే మాగ్నసైట్‌ వంటి ఖనిజాల ఉత్పత్తి 90%కు పైగా పెరిగింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో శుద్ధి చేసిన రాగి ఉత్పత్తి సంవత్సరానికి 5,55,000 మిలియన్‌ టన్నులు ఉంటుందని అంచనా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని