Anant Ambani: ప్రీవెడ్డింగ్‌లో అనంత్‌ మాటలకు.. కన్నీళ్లు పెట్టుకున్న ముకేశ్ అంబానీ

Anant Ambani pre-wedding event: ప్రీవెడ్డింగ్‌ వేడుకల్లో అనంత్‌ అంబానీ తన ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడుతుండగా ఆయన తండ్రి ముకేశ్‌ కన్నీళ్లు పెట్టుకున్నారు.

Updated : 02 Mar 2024 16:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత సంపన్నుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani) చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ (Anant Ambani), రాధికా మర్చంట్‌ల  ప్రీ-వెడ్డింగ్‌ వేడుకలు (pre-wedding event) గ్రాండ్‌గా జరుగుతున్నాయి. తొలిరోజు ఈవెంట్‌లో అనంత్‌ మాట్లాడారు. ఈసందర్భంగా తన ఆరోగ్య సమస్యల గురించి చెబుతుండగా ముకేశ్‌ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు.

ఈ ముందస్తు పెళ్లి వేడుకలను మరింత ప్రత్యేకంగా చేసేందుకు తన కుటుంబం చాలా కష్టపడిందని అనంత్‌ తెలిపారు. ‘‘నన్ను సంతోషంగా ఉంచేందుకు మా అమ్మ ఎంతో చేశారు. రోజుకు 18-19 గంటలు కష్టపడ్డారు. ప్రీవెడ్డింగ్‌ ఈవెంట్‌ను స్పెషల్‌గా చేసేందుకు గత రెండు నెలలుగా మా కుటుంబమంతా కేవలం 3 గంటలే నిద్రపోయింది. మీ అందరికీ తెలుసు.. నా జీవితం పూర్తిగా పూలపాన్పు కాదు. ఎన్నో ముళ్లు గుచ్చుకున్న బాధనూ అనుభవించా. చిన్నప్పటి నుంచి చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నా. కానీ, ఆ బాధను మర్చిపోయేలా నా తల్లిదండ్రులు ఎల్లప్పుడూ అండగా నిలిచారు. అనుకున్నది సాధించేలా ప్రోత్సహించారు. వారికి నేనెప్పుడూ రుణపడి ఉంటా’’ అని చెప్పారు. కుమారుడి మాటలకు ముకేశ్‌ భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.

జామ్‌నగర్‌ వేదికగా మూడు రోజుల పాటు జరిగే ఈ ముందస్తు పెళ్లి వేడుకలు శుక్రవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. తొలిరోజు పాప్‌ సింగర్‌ రిహన్నాతో పాటు పలువురు ప్రదర్శనలిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని