Go First: 9 వరకు గోఫస్ట్ విమానాల రద్దు.. దివాలా పిటిషన్‌పై NCLT ఆదేశాలు రిజర్వ్
గోఫస్ట్ విమాన సంస్థ మే 9 వరకు సర్వీసులను రద్దు చేసింది. దివాలా పరిష్కారం కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్సీఎల్టీ తన తీర్పును రిజర్వ్ చేసింది.
దిల్లీ: స్వచ్ఛంద దివాలా పరిష్కారం కోరుతూ గోఫస్ట్ ఎయిర్‌లైన్స్ (Go First) దాఖలు చేసిన పిటిషన్‌పై ది నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT) తన ఆదేశాలను రిజర్వ్ చేసింది. వాడియా గ్రూప్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై జస్టిస్ రామలింగం సుధాకర్ నేతృత్వంలోని ఇద్దరు సభ్యుల బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. నగదు చెల్లింపుల బాధ్యత విషయంలో మారటోరియం కోరుతూ మధ్యంతర ఆదేశాలివ్వాలని గోఫస్ట్ అభ్యర్థించింది. అలాగే కఠిన చర్యలు తీసుకోకుండా డీజీసీను సైతం ఆదేశించాలని కోరింది. అయితే, దివాలా పరిష్కార ప్రక్రియ విషయంలో మారటోరియంపై విమాన లీజుదారులు అభ్యంతరం వ్యక్తంచేశారు. తమ వాదనలు వినకుండా ముందుకెళ్లకూడదని కోరారు. ఈ నేపథ్యంలో తన ఆదేశాలను బెంచ్ రిజర్వ్‌లో పెట్టింది.
మరోవైపు గోఫస్ట్ ఎయిర్వేస్ సంస్థ మరిన్ని సర్వీసులను రద్దు చేసింది. తొలుత మే 3, 4, 5 తేదీల్లో సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఆ సంస్థ.. తాజాగా 9వ తేదీ వరకు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆపరేషనల్ కారణాల వల్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఆ సంస్థ తన వెబ్సైట్లో పేర్కొంది. ఆయా తేదీల్లో టికెట్లు బుక్ చేసుకున్న వారికి పూర్తి టికెట్ సొమ్మును వాపసు చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. దాదాపు రూ.350 కోట్ల మేర సొమ్మును రిఫండ్ చేయాల్సి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మే 15 వరకు టికెట్ల విక్రయాలను నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ డీజీసీఏకు (DGCA) వెల్లడించింది. ఈ నేపథ్యంలో పూర్తి టికెట్ సొమ్మును రిఫండ్ చేయాలని ఆదేశించినట్లు డీజీసీఏ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐఫోన్ ప్రియులకు గుడ్‌న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
iPhones cheaper: ఐఫోన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడమే దీనికి కారణం. -
ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి.. సుందర్ పిచాయ్‌కి గౌరవ డాక్టరేట్
Sundar Pichai: భారత్‌లోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. -
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
Stock market: దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1292, నిఫ్టీ 428 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
TIME Greatest Places: హోటళ్లు, క్రూజ్‌లు, రెస్టారంట్లు, పర్యటక స్థలాలు, మ్యూజియంలు, పార్క్‌లను పరిగణనలోకి తీసుకొని టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని 100 గొప్ప ప్రదేశాల జాబితాను విడుదల చేసింది. -
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
Gold price: బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆ దుకాణాల్లో ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. -
గూగుల్‌కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్‌జీపీటీ ఓనర్
SearchGPT: గూగుల్‌కు పోటీగా ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చింజిన్‌ను తీసుకొచ్చింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది. -
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
ITR filing: ఐటీఆర్ ఫైలింగ్‌లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దాఖలు గడువు ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నాయి. -
జియో ఫ్రీడమ్ ఆఫర్.. ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లపై 30% తగ్గింపు
Jio Freedom Offer: ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్ల ఇన్స్టాలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇది పరిమితకాల ఆఫర్. -
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
Job Trends: ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే ఉద్యోగాలు ఇకపై కనుమరుగవుతాయని లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అంచనా వేశారు. -
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (7)
సంక్షిప్త వార్తలు
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్‌మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్‌లో రకుల్‌ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్‌రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్‌న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్