Nestle: మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించిన నెస్లే ఇండియా

నెస్లే ఇండియా ఒక్కో షేరుకు రూ.27 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించింది.

Updated : 12 Apr 2023 16:20 IST

దిల్లీ: ప్రముఖ FMCG సంస్థ నెస్లే ఇండియా బుధవారం మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించింది. ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.27 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను చెల్లిస్తామని ప్రకటించింది. మధ్యంతర డివిడెండ్‌ చెల్లింపు కోసం వాటాదారుల అర్హతను నిర్ణయించడానికి కంపెనీ ఏప్రిల్‌ 21వ తేదీని రికార్డ్‌ డేట్‌గా నిర్ణయించింది. 64వ వార్షిక సర్వసభ్య సమావేశంలో సభ్యుల ఆమోదంతో 2022 సంవత్సర తుది డివిడెండ్‌తో పాటు, 2023కు సంబంధించిన మధ్యంతర డివిడెండ్‌ను మే 8న చెల్లిస్తారు. నెస్లే ఇండియా 2001 మే 31 నుంచి ఇప్పటిదాకా 66 డివిడెండ్‌లను ప్రకటించింది. గత 12 నెలల్లో, నెస్లే ఒక్కో షేరుకు రూ.210 చొప్పున డివిడెండ్‌ ప్రకటించింది. గత నెల వ్యవధిలో ఈ స్క్రిప్‌ 6.56 శాతం లాభపడింది. బుధవారం ఎన్‌ఎస్‌ఈలో షేరు 1 శాతానికి పైగా నష్టపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు