Direct tax collection: 13.73 లక్షల కోట్లకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు

Tax collections: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.13.73 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. బడ్జెట్‌ అంచనాల ప్రకారం ఇప్పటికే 96.67 శాతం వసూలయ్యాయి.

Updated : 11 Mar 2023 13:14 IST

దిల్లీ: దేశంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు (Direct tax collection) గతేడాదితో పోలిస్తే 17 శాతం మేర పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.13.73 లక్షల కోట్లు వసూళ్లు జరిగాయి. పూర్తి సంవత్సరానికి సవరించిన అంచనాల ప్రకారం ఈ మొత్తం 83 శాతంతో సమానమని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) తెలిపింది. పర్సనల్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌, కార్పొరేట్‌ ట్యాక్స్‌లను ప్రత్యక్ష పన్నులుగా వ్యవహరిస్తారు.

గతేడాది ఏప్రిల్‌ 1 నుంచి మార్చి 10 వరకు స్థూలంగా మొత్తం రూ.16.68 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నుల వసూళ్లు జరిగాయి. అందులో రూ.2.95 లక్షల కోట్ల రిఫండ్లు పోగా.. రూ.13.73 లక్షల కోట్లు నికరంగా వచ్చాయి. బడ్జెట్‌ అంచనాల ప్రకారం ఈ మొత్తం 96.67 శాతంతో సమానం కాగా.. 2022-23 సంవత్సరానికి గానూ సవరించిన అంచనాల ప్రకారం వసూళ్లు 83.19 శాతంగా నమోదయ్యాయని సీబీడీటీ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా 20 రోజల గడువు ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని