Stock Market: స్టాక్‌ మార్కెట్‌ ప్రత్యేక సెషన్‌.. సెన్సెక్స్‌ 61+, నిఫ్టీ 39+

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు శనివారం కొంతసేపు పనిచేశాయి. ఈ ప్రత్యేక సెషన్‌లో సూచీలు కొత్త గరిష్ఠాలను తాకాయి.

Updated : 02 Mar 2024 12:52 IST

Stock Market special live trading session I ముంబయి: స్టాక్‌ మార్కెట్‌ ప్రత్యేక సెషన్‌లో సూచీలు రాణించాయి. సెన్సెక్స్‌, నిఫ్టీ రెండూ కొత్త జీవన కాల గరిష్ఠాలను నమోదు చేశాయి. ఆపై కాస్త స్వల్పంగా క్షీణించాయి. సెన్సెక్స్‌ 61 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 22,400 పాయింట్ల ముంగిట ముగిసింది. ఉదయం 9.15 గంటల నుంచి 10 గంటల వరకు తొలి సెషన్‌ జరగ్గా.. ఉదయం 11.30 నుంచి 12.30 మధ్య మరో సెషన్‌ జరిగింది.

ఉదయం 73,848.19 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ ఓ దశలో 73,994.70 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 61 పాయింట్లు లాభంతో 73,806.15 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 22,419.55 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. చివరికి  39.65 పాయింట్లు లాభంతో 22,378.40 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 30లో టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, విప్రో రాణించగా.. మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఎన్టీపీసీ, మారుతీ, సన్‌ఫార్మా, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ నష్టాల్లో ముగిశాయి.

ఎందుకీ సెషన్‌..?: ప్రాథమిక సైట్‌లో ఏమైనా లోపాలు తలెత్తితే ఎదుర్కొనే సన్నద్ధతను పరీక్షించేందుకు శనివారం ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్‌ విభాగాల్లో ప్రత్యేక ట్రేడింగ్‌ సెషన్‌ను బీఎస్‌ఈ (BSE), ఎన్‌ఎస్‌ఈ (NSE) నిర్వహించాయి.  రెండు సెషన్లలో ప్రత్యేక ట్రేడింగ్‌ను నిర్వహించారు. తొలుత ప్రాథమిక సైట్‌లో.. తర్వాత డిజాస్టర్‌ రికవరీ సైట్‌లో ట్రేడింగ్‌ జరిపారు. అన్ని సెక్యూరిటీస్‌, డెరివేటివ్‌ ఉత్పత్తులను ట్రేడింగ్‌కు అవకాశం ఇచ్చారు. గరిష్ఠ పరిమితిని 5 శాతంగా నిర్ణయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని