Nikhil Kamath: ఆ ఒక్క రోజు డివైజెస్‌కు గుడ్‌బై.. నిఖిల్‌ కామత్‌ సూచన

Nikhil Kamath: సోషల్‌మీడియాపై నియంత్రణ పొందేందుకు జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌ ఓ సూచన చేశారు. అదేంటంటే..?

Published : 30 May 2024 00:09 IST

Nikhil Kamath | ఇంటర్నెట్‌డెస్క్‌: ఉదయాన్నే లేచినప్పటినుంచి వ్యక్తిగత పని, ఆఫీసు పని అంటూ నిత్యం సోషల్‌మీడియాలోనే గడుపుతుంటాం. రోజుకు ఎంతసేపు వీటితో కాలక్షేపం చేస్తున్నామో కూడా గమనించం. అంతలా సామాజిక మాధ్యమాలకు బానిసలుగా మారిపోయాం. దీన్ని అధిగమించేందుకు ఇప్పటికే చాలామంది అనేక సూచనలు, సలహాలు ఇస్తూ వచ్చారు. తాజాగా జెరోదా (Zerodha) సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌ (Nikhil Kamath) కూడా అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ టిప్‌ అందించారు.

ఈ వేగవంతమైన ఆధునిక ప్రపంచంలో శ్రద్ధ లోపించడం, ఏదైనా విషయంపై తదేకంగా దృష్టి పెట్టలేకపోవడం.. వంటి అంశాలపై కామత్‌ ఆందోళన వ్యక్తంచేశారు. ఒక్క నిమిషంలో సోషల్‌మీడియాలో జరిగే కార్యాచరణకు సంబంధించిన గణాంకాలను ‘‘ఎక్స్‌’’ వేదికగా పంచుకున్నారు. కేవలం ఒక్క నిమిషంలో 416 లక్షల మెసేజ్‌లు, 63 లక్షల గూగుల్‌ సెర్చ్‌లు, 2,140 లక్షల ఇ- మెయిల్స్‌ పంపుతున్నారని తెలిపారు. సమయాన్ని అత్యంత విలువైనదిగా గుర్తించమన్నారు. ‘‘అన్నింటికంటే విలువైనది సమయం. అది మన నియంత్రణ ఉంటోందనుకుంటే నిజంగా భ్రమే ’’ అని ఆయన అన్నారు. అందుకే సామాజిక మాధ్యమాలపై నియంత్రణ పొందేందుకు ‘‘device-free’’ పీరియడ్‌ను పాటించాలన్నారు.  

ఓపెన్‌ఏఐ సీఈఓ కీలక ప్రకటన.. సగానికి పైగా సంపద దాతృత్వానికే

‘‘ ప్రతి నెలా చివరి ఆదివారంలో ఎటువంటి డివైజ్‌లు ఉపయోగించొద్దు. అప్పుడే మనం ఫిజికల్‌గా ఎలాంటి పనులు చేస్తామో తెలుసుకుంటాం’’ అని కామత్‌ అన్నారు. అందరూ ఈ డివైజ్‌- ఫ్రీ పీరియడ్‌ను పాటించాలన్నారు. అంతే కాదు సోషల్‌మీడియా గణాంకాలకు సంబంధించిన ఫొటోలను తన ఫాలోవర్లతో పంచుకున్నారు. ఈ లెక్కలు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం కామత్‌ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. చాలామంది యూజర్లు ఈ సలహాను పాటిస్తానంటూ కామత్‌ మాటతో ఏకీభవించారు. ‘‘ కనీసం నెలలో ఒక్కరోజైనా కచ్చితంగా డిజిటల్‌ వస్తువులకు దూరంగా ఉండాల్సిందే’’ అని ఓ యూజర్‌ కామెంట్‌ చేశాడు. ‘‘ సమయం అనేది అత్యంత విలువైనది. మనం నిత్యం దాన్ని వృధా చేస్తున్నాం’’ అని మరో నెటిజన్‌ రాసుకొచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని