Nissan Motor: నిస్సాన్‌ గ్లోబల్‌ సేల్స్‌ లక్ష్యం 10 లక్షల వాహనాలు

జపాన్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ నిస్సాన్‌ మోటార్స్‌ వచ్చే మూడేళ్లలో 10 లక్షల వాహనాల విక్రయాల వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది.

Published : 25 Mar 2024 17:44 IST

దిల్లీ: జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్‌ మోటార్‌ తన భవిష్యత్‌ ప్రణాళికలను వెల్లడించింది. 2027 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరం నాటికి 30 కొత్త మోడళ్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది. లాభదాయకతను మెరుగుపరిచేందుకు ఖర్చులను తగ్గించుకుంటామని తెలిపింది. నిర్దేశిత లక్ష్యంలోగా తమ విక్రయాలను ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల యూనిట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిస్సాన్‌ పేర్కొంది. దశాబ్దం చివరి నాటికి గ్లోబల్‌ అమ్మకాల్లో 60% వరకు విద్యుత్‌, హైబ్రిడ్‌ వాహనాలను కలిగి ఉండాలని ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే మూడేళ్లలో నిస్సాన్‌కు సంబంధించిన 30 కొత్త మోడళ్లలో 16 మోడళ్ల వాహనాలు విద్యుత్‌వే ఉంటాయని సంస్థ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని