Vodafone Idea: వొడాఫోన్‌ ఐడియా టేకోవర్‌పై కేంద్రం క్లారిటీ

Vodafone Idea: వొడాఫోన్‌ ఐడియా టెలికాం కంపెనీని టేకోవర్‌ చేసే ప్రతిపాదనేదీ లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు పార్లమెంట్‌కు లిఖిత పూర్వకంగా తెలియజేసింది.

Published : 13 Dec 2023 21:23 IST

Vodafone Idea | దిల్లీ: నష్టాల్లో కూరుకుపోయిన టెలికాం కంపెనీ వొడాఫోన్‌ ఐడియాను (Vodafone Idea) టేకోవర్‌ చేసే ఉద్దేశమేదీ ప్రభుత్వానికి లేదని కేంద్రం స్పష్టంచేసింది. కంపెనీని హస్తగతం చేసుకునే ఉద్దేశమేదైనా ఉందా అంటూ పార్లమెంట్‌లో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కమ్యూనికేషన్‌ శాఖ సహాయ మంత్రి దేవ్‌సిన్హ్‌ చౌహాన్‌ బుధవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని చెప్పారు.

వొడాఫోన్‌ ఐడియాలో 33.1 శాతం వాటాతో కేంద్ర ప్రభుత్వం అతిపెద్ద షేర్‌ హోల్డర్‌గా ఉంది. రూ.16,133 కోట్ల ఏజీఆర్‌ బకాయిలను కేంద్రం ఈక్విటీ మార్చుకోవడంతో ఈ వాటా దఖలు పడింది. వొడాఫోన్‌ ఐడియాకు ఆర్థికంగా ఊతమివ్వాలన్న ఉద్దేశమే తప్ప.. టెలికాం కంపెనీని టేకోవర్‌ చేసే ఉద్దేశమేదీ లేదని చెప్పారు. యూకేకు చెందిన వొడాఫోన్‌ గ్రూప్‌, భారత్‌కు చెందిన ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన జాయింట్ వెంచర్‌ అయిన వొడాఫోన్‌ ఐడియా రోజువారీ కార్యకలాపాల్లో తాము జోక్యం చేసుకోబోమని చెప్పారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ తన సర్వీసులను మెరుగుపరుచుకునేందుకు తన వంతు ప్రయత్నం చేస్తోందని మరో ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు