NSE New Rule: NSEలో టిక్‌ సైజ్‌ పైసాకు కుదింపు.. ఇంతకీ ఏంటిది? ఏం ప్రభావం ఉంటుంది?

NSE News Rule: రూ.250 కంటే తక్కువ ధర పలికే స్టాక్స్‌ టిక్‌ సైజ్‌ను ఎన్‌ఎస్‌ఈ ఒక పైసాకు కుదించింది. ఇంతకీ టిక్‌ సైజ్‌ అంటే ఏంటి? దీని ప్రభావం ట్రేడింగ్‌పై ఎలా ఉంటుందో చూద్దాం.

Published : 27 May 2024 15:47 IST

NSE News Rule | ముంబయి: ‘జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (NSE)’ తమ ట్రేడింగ్‌ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. రూ.250 కంటే తక్కువ ధర పలికే స్టాక్స్‌ టిక్‌ సైజ్‌ను ఒక పైసాకు కుదించింది. గతంలో ఇది ఐదు పైసలుగా ఉండేది. కొత్త మార్పు జూన్‌ 10 నుంచి అమల్లోకి రానుంది. ఇంతకీ టిక్‌ సైజ్‌ అంటే ఏంటి? దీని ప్రభావం ట్రేడింగ్‌పై ఎలా ఉంటుందో చూద్దాం.

ఇదీ ప్రభావం..

టిక్ సైజు అనేది సెక్యూరిటీ లేదా ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్ ధరలో వచ్చే కనిష్ఠ మార్పు. స్టాక్‌ ధర మారగల అతి చిన్న పెంపును ఇది సూచిస్తుంది. దీన్ని స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిర్ణయిస్తుంది. ధరలో కచ్చితత్వం కోసం దీన్ని సవరించారు.  టిక్‌ సైజ్‌ (Tick Size) ఎంత తక్కువగా ఉంటే ధరలో అంత కచ్చితత్వం ఉంటుంది. తద్వారా ట్రేడర్లు మరింత తక్కువ ధరకు బిడ్లు దాఖలు చేయడం లేదా విక్రయించడానికి అవకాశం ఏర్పడుతుంది. దీనివల్ల ట్రేడింగ్‌ వ్యయాలు సైతం తగ్గుతాయి.

ఫ్యూచర్స్‌, ఆప్షన్స్‌కు ఇలా..

కొత్త మార్పు ఈక్యూ, బీఈ, బీజెడ్‌, బీఓ, ఆర్‌ఎల్‌, ఏఎఫ్‌ సిరీస్‌ కింద నమోదైన ఈటీఎఫ్‌లు మినహా మిగిలిన అన్ని సెక్యూరిటీలకు వర్తిస్తుంది. క్యాపిటల్‌ మార్కెట్‌ విభాగంలోని స్టాక్‌ ధరకు అనుగుణంగా ఫ్యూచర్స్‌ సెగ్మెంట్‌లోనూ టిక్‌ సైజ్‌లో మార్పులు చేస్తారు. అయితే, నెలలో చివరి ట్రేడింగ్‌ రోజు నాటి ధర ఆధారంగా తర్వాత నెల టిక్‌ సైజ్‌ను నిర్ధరిస్తారు. ఆప్షన్స్‌ విభాగంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు