Ola Electric IPO: ఓలా ఎలక్ట్రిక్‌ ఐపీఓకు సెబీ గ్రీన్‌ సిగ్నల్‌!

Ola Electric IPO: ఓలా ఎలక్ట్రిక్‌ ఐపీఓకు సెబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. మార్కెట్‌ నుంచి రూ.7,250 కోట్లను ఓలా సమీకరించనుంది.

Published : 11 Jun 2024 17:56 IST

Ola Electric IPO | దిల్లీ: ప్రముఖ విద్యుత్‌ వాహన సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ (Ola Electric) మార్కెట్‌ నుంచి నిధులు సమీకరించేందుకు మార్గం సుగమమైంది. ప్రతిపాదిత ఐపీఓకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌ సిగ్నల్‌ లభించినట్లు తెలిసింది. మొత్తం రూ.7,250 కోట్లను ఐపీఓ ద్వారా ఓలా ఎలక్ట్రిక్‌ సమీకరించనుంది. సెబీ నుంచి అనుమతి పొందిన తొలి ఈవీ స్టార్టప్‌ ఇదే కావడం గమనార్హం.

ఐపీఓ కోసం సెబీకి ఓలా ఎలక్ట్రిక్‌ గతేడాది డిసెంబర్‌లోనే దరఖాస్తు చేసుకోగా.. తాజాగా ఆమోదం లభించింది. ఐపీఓలో భాగంగా ఫ్రెష్‌ షేర్ల జారీ ద్వారా రూ.5,500 కోట్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ 95.19 మిలియన్‌ షేర్లను విక్రయించనున్నారు. వీటి విలువ రూ.1,750 కోట్లు ఉంటుంది. ఓలా ఎలక్ట్రిక్‌ వ్యవస్థాపకుడు భవీశ్‌ అగర్వాల్  47.3 మిలియన్‌ షేర్లను, సంస్థ ప్రారంభంలో పెట్టుబడులు పెట్టిన ఆల్ఫావేవ్‌, ఆల్పైన్‌, డీఐజీ ఇన్వెస్ట్‌మెంట్‌, మ్యాట్రిక్స్‌ 47.89 మిలియన్‌ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ రూపంలో విక్రయించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని