Fastag KYC: ఇంకా ఒక్కరోజే గడువు.. ఫాస్టాగ్‌ కేవైసీ చేశారా?

వాహనాల ఫాస్టాగ్‌ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఎన్‌హెచ్‌ఏఐ విధించిన గడువు తేదీ గురువారంతో ముగియనుంది.

Published : 28 Feb 2024 14:11 IST

దిల్లీ: ఒకే వాహనం ఒకే ఫాస్టాగ్‌ (Fastag) ఉండాలన్న ఉద్దేశంతో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) గత నెలలో కీలక నిర్ణయం తీసుకుంది. ఫాస్టాగ్‌ల కేవైసీ పూర్తి చేయాలని వాహనదారులకు సూచించింది. ఇందుకు జనవరి 31ని తొలుత గడువు తేదీగా నిర్ణయించింది. తర్వాత దాన్ని ఫిబ్రవరి 29కి పొడిగించింది. రేపటితో ఈ గడువు ముగియనుంది. మరోసారి దీన్ని పొడిగించేందుకు సుముఖంగా లేదని సమాచారం. ఇప్పటికీ ఎవరైనా ఫాస్టాగ్‌ కేవైసీ చేయకుంటే.. గురువారంలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. లేనిపక్షంలో వాటిని డీయాక్టివేట్ చేస్తామని ఎన్‌హెచ్‌ఏఐ ఇప్పటికే స్పష్టం చేసింది. ఫాస్టాగ్‌ వెబ్‌సైట్‌తో పాటు నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ టోల్‌ కలెక్షన్‌ (NETC) వెబ్‌సైట్‌ ద్వారా కేవైసీ చేసుకోవచ్చని తెలిపింది. 

ఫాస్టాగ్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మొబైల్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ లేదా ఓటీపీ ఎంటర్‌ చేసి లాగిన్‌ అవ్వాలి. తర్వాత డ్యాష్‌బోర్డులోకి వెళ్లి ‘మై ప్రొఫైల్‌’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ స్టేటస్‌ కనిపిస్తుంది. ఒకవేళ కేవైసీ పూర్తి కాకపోయి ఉంటే అడిగిన వివరాలు సమర్పించి ప్రాసెస్‌ చేయాలి. మొబైల్‌ నంబర్‌ ఎన్‌హెచ్‌ఏఐ వద్ద రిజిస్టర్‌ కాకుంటే.. ‘మై ఫాస్టాగ్‌’ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకుని అందులో రిజిస్టర్ చేసుకోవాలి. బ్యాంకులు జారీ చేసిన ఫాస్టాగ్‌లు అయితే బ్రాంచ్‌కి వెళ్లి మొబైల్‌ నెంబర్‌ రిజిస్టర్‌ చేసుకోవాలి. ఆ తర్వాత కేవైసీ పూర్తి చేసుకోవాలి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని