Airtel: వచ్చే నెల నుంచి వన్‌వెబ్‌ శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు: సునీల్‌ మిత్తల్‌

Sunil Mittal on OneWeb satellite services: వన్‌వెబ్‌ శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ సేవలు వచ్చే నెల అందుబాటులోకి రానున్నాయని భారతీ ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌ సునీల్‌ మిత్తల్‌ తెలిపారు.

Updated : 27 Oct 2023 16:31 IST

దిల్లీ: వన్‌వెబ్‌ శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ సేవలు వచ్చే నెల దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయని భారతీ ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌ సునీల్‌ మిత్తల్‌ (Sunil Mittal) తెలిపారు. ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గతేడాది 5జీ సేవలను ఎయిర్‌టెల్‌ ప్రారంభించిందని, ఇప్పటి వరకు 5000 నగరాలు, పట్టణాలు, 20వేల గ్రామాల్లో సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఈ సందర్భంగా శాటిలైట్‌ బ్రాండ్‌బ్యాండ్‌ సేవల గురించి మిత్తల్‌ మాట్లాడారు.

వన్‌వెబ్‌ ప్రపంచంతోపాటు దేశానికి సేవలు అందించడడానికి సిద్ధమైందని సునీల్‌ మిత్తల్‌ తెలిపారు. దీని ద్వారా దేశంలో ఏ మారుమూల ప్రదేశంలోనైనా, ఎవరైనా ఈ సేవలు పొందొచ్చని చెప్పారు. వచ్చే నెల నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. భారతీ ఎయిర్‌టెల్‌కు చెందిన వన్‌వెబ్‌ లండన్‌కు చెందిన యూటెల్‌శాట్‌ కంపెనీలో విలీనం అయ్యింది. విలీన సంస్థలో ఎయిర్‌టెల్‌ 21.2 శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా ఉంది. భూ సమీప కక్ష్యలోలోని 618 శాటిలైట్ల ద్వారా వన్‌వెబ్‌ ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవలు అందించనుంది.

జియో నుంచి ఇక శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు

5జీ కోసం పెట్టుబడులు: బిర్లా

దేశవ్యాప్తంగా 5జీ సేవల ప్రారంభం, 4జీ విస్తరణ కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆదిత్యా బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ కుమార్‌ మంగళం బిర్లా చెప్పారు. మొబైల్‌ కాంగ్రెస్‌ సదస్సులో ఈ మేరకు ఆయన మాట్లాడారు. భారత డిజిటల్‌ ఎకోసిస్టమ్‌ అందనంత ఎత్తుకు ఎదిగిందని ప్రశంసించారు. ఓ వైపు ఎయిర్‌టెల్‌, జియో పోటాపోటీగా 5జీ సేవలను విస్తరిస్తుండగా.. వొడాఫోన్‌ మాత్రం వెనకబడిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని