ఓయో ఐపీఓ దరఖాస్తు ఉపసంహరణ!

తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) కోసం సెబీకి సమర్పించిన దరఖాస్తును ఓయో ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీ రీఫైనాన్సింగ్‌ ప్రణాళికను ఖరారు చేసే పనిలో ఉందని.. ఈ ప్రక్రియ పూర్తయ్యాక తిరిగి ఐపీఓకు దరఖాస్తు చేసే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

Published : 19 May 2024 01:53 IST

దిల్లీ: తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) కోసం సెబీకి సమర్పించిన దరఖాస్తును ఓయో ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీ రీఫైనాన్సింగ్‌ ప్రణాళికను ఖరారు చేసే పనిలో ఉందని.. ఈ ప్రక్రియ పూర్తయ్యాక తిరిగి ఐపీఓకు దరఖాస్తు చేసే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ‘రీఫైనాన్సింగ్‌ ప్రక్రియ వల్ల కంపెనీ ఆర్థిక వివరాల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. అందువల్ల నిబంధనల ప్రకారం సెబీకి సవరించిన ఐపీఓ దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కంపెనీ రీఫైనాన్సింగ్‌కు సంబంధించి నిర్ణయం తుది దశలో ఉన్నందున.. ప్రస్తుత వివరాలతోనే ఐపీఓ దరఖాస్తు ఆమోదం కోసం ప్రయత్నించడంలో అర్థం లేద’ని ఆ వర్గాలు వెల్లడించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని