Budget Session: జనవరి 31 నుంచి బడ్జెట్‌ సమావేశాలు.. మహిళా రైతులకు శుభవార్త ఉండేనా?

Parliament Budget Session: జనవరి 31 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరికొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ.. ఈ సారి కేంద్రం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.

Updated : 11 Jan 2024 13:28 IST

దిల్లీ: పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాల (Parliament Budget Session) షెడ్యూల్‌ ఖరారైనట్లు తెలుస్తోంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు ఈ సమావేశాలను నిర్వహించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు గురువారం వెల్లడించాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) బడ్జెట్‌ సభలో ప్రవేశపెడతారు.

ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చే చివరి పద్దు ఇది. సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం ఈసారి ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. అంటే కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు చేయాల్సిన ఖర్చులకు పార్లమెంట్‌ ఆమోదం తీసుకోవడమే. బ్రిటీష్‌ కాలం నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఈసారి ఆకర్షణీయమైన ప్రకటనలు, విధానపరంగా కీలకమైన మార్పులు ఉండకపోవచ్చని ఇప్పటికే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సంకేతాలిచ్చారు.

ఈ ఆరు దేశాల పాస్‌పోర్టులు అత్యంత శక్తిమంతమైనవి.. భారత్‌ స్థానం ఎక్కడంటే?

అయితే, ఎన్నికల ముందు మహిళా రైతులకు కేంద్రం ఈ బడ్జెట్‌ సమావేశాల్లో శుభవార్త చెప్పే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వీరికి పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి (PM Kisan Samman Nidhi) మొత్తాన్ని రెట్టింపు చేసే ప్రతిపాదనలు ఉండొచ్చు. ఇటీవల శీతాకాల సమావేశాల్లో దుండగులు రంగుల పొగతో సృష్టించిన అలజడి పార్లమెంట్ భద్రతపై ఆందోళనలు రేపిన విషయం తెలిసిందే. దీంతో ఈ సారి భద్రతను కట్టుదిట్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని