Paytm: పేటీఎం సంక్షోభం.. పీపీబీఎల్‌తో ఒప్పందాల రద్దు

Paytm: నియంత్రణాపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమ అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌తో ఉన్న అంతర్గత ఒప్పందాలన్నింటినీ ఉపసంహరించుకుంటున్నట్లు పేటీఎం ప్రకటించింది.

Updated : 01 Mar 2024 10:12 IST

బెంగళూరు: నియంత్రణాపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమ అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌తో (PPBL) అంతర్గతంగా ఉన్న ఒప్పందాలన్నింటినీ ఉపసంహరించుకుంటున్నట్లు ఫిన్‌టెక్‌ కంపెనీ పేటీఎం (Paytm) మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ ప్రకటించింది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య పరస్పర అంగీకారం కుదిరినట్లు శుక్రవారం తెలిపింది. అయితే, ఆ ఒప్పందాలు ఏంటనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. పీపీబీఎల్‌ స్వతంత్రంగా తన కార్యకలాపాలు నిర్వహించుకునే సామర్థ్యాన్ని మెరుగుపర్చడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.

తమ కస్టమర్లు, వ్యాపారులకు నిరంతరాయ సేవలను కొనసాగించడం కోసం ఇతర బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకోనున్నట్లు పేటీఎం (Paytm) ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తద్వారా పేటీఎం యాప్‌, క్యూఆర్‌, సౌండ్‌బాక్స్‌, కార్డు మెషీన్లు యథావిధిగా పనిచేస్తాయని తెలిపింది. పీపీబీఎల్‌ పార్ట్‌టైమ్‌ నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ హోదా నుంచి విజయ్‌ శేఖర్‌ శర్మ వైదొలగిన కొన్ని రోజుల్లోనే తాజా పరిణామం చోటుచేసుకుంది. పీపీబీఎల్‌లో ఆయనకు 51 శాతం వాటాలున్నాయి. మిగతావి వన్‌97 కమ్యూనికేషన్స్‌ చేతిలో ఉన్నాయి.

జనవరి 31న పీపీబీఎల్‌పై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో 2024 మార్చి 15 తర్వాత డిపాజిట్లను స్వీకరించొద్దు. వినియోగదారుల ఖాతాలు, ప్రీ పెయిడ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌లు, వాలెట్‌లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, నేషనల్‌ కామన్‌ మొబిలిటీ (ఎన్‌సీఎంసీ) కార్డులు తదితరాల్లో క్రెడిట్‌ లావాదేవీలు లేదా టాప్‌అప్‌లు చేయొద్దు. ఈ నేపథ్యంలో గతకొన్ని రోజులుగా కంపెనీ షేరు విలువ (Paytm share price) పతనమవుతూ వస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని