Pepsico: పెప్సికో ఇండియా.. భారీ పెట్టుబడి

మధ్యప్రదేశ్‌లో శీతల పానీయ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు పెప్సికో ఇండియా రూ.1,266 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.

Published : 02 Apr 2024 19:01 IST

దిల్లీ: దేశంలో విస్తరణ ప్రణాళికలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో శీతల పానీయ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు రూ.1,266 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు పెప్సికో ఇండియా మంగళవారం వెల్లడించింది. 22 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్లాంట్‌ భారత్‌లో పెప్సికోకు సంబంధించిన పానీయాల ఉత్పత్తిని భారీగా పెంచనుంది. స్థానికంగా ఉపాధిని సృష్టించడమే కాకుండా, అక్కడి ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపడంలో ముఖ్యమైన పాత్ర పోషించనుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

రాబోయే ప్లాంట్‌ నిర్మాణం 2024లో మొదలవుతుందని, 2026 మొదటి త్రైమాసికంలో ఉత్పత్తి ఆరంభం అవుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. పెప్సికో ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (బెవరేజెస్‌) జార్జ్‌ కోవూర్‌ మాట్లాడుతూ.. ఈ కొత్త యూనిట్‌ భారత్‌లో కంపెనీకి రెండో ‘ఫ్లేవర్‌ తయారీ కేంద్రం’ అని తెలిపారు. భారత్‌లో పెప్సికో మొట్టమొదటి శీతల పానీయ తయారీ కేంద్రం పంజాబ్‌లోని చన్నోలో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు