PhonePe: సింగపుర్‌లోనూ ఇకపై ఫోన్‌పే యూపీఐ సేవలు

PhonePe: ఇకపై సింగపుర్‌లోని తమ యూజర్లు యూపీఐ చెల్లింపులు చేయొచ్చని ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే బుధవారం ప్రకటించింది. 

Published : 03 Apr 2024 21:32 IST

PhonePe | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే (PhonePe) సింగపుర్‌ (Singapore)లోనూ యూపీఐ సేవల్ని ప్రారంభించింది. ఇకపై స్థానికంగా నివసిస్తున్న తన యూజర్లు యూపీఐ ద్వారా చెల్లింపులు చేయొచ్చని బుధవారం వెల్లడించింది. పర్యాటకానికి వచ్చే భారతీయుల సౌలభ్యం కోసం ఈ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది.

ఆ దేశంలో భారతీయులు యూపీఐ చెల్లింపులను ప్రోత్సహించేందుకు సింగపుర్ టూరిజం బోర్డు (STB), ఫోన్‌పే మధ్య రెండేళ్ల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయని ఫిన్‌టెక్‌ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. అందులో భాగంగానే సింగపుర్‌లో ఫోన్‌పే సేవలు ప్రారంభించినట్లు తెలిపింది. దీంతో నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్‌ కోడ్‌ ద్వారా స్కాన్‌ చేసి సురక్షితమైన చెల్లింపులు చేయొచ్చని ఫోన్‌పే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రితేష్ పాయ్ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని