థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలంటే ఆ విద్యుత్‌ కొనాల్సిందే

Thermal plants: థర్మల్‌ పవర్‌ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి కేంద్రం నిబంధనలను సవరించింది. 2023 ఏప్రిల్‌ 1 తర్వాత ఏర్పాటు చేసే ప్లాంట్లు తప్పనిసరిగా పునరుత్పతాదక విద్యుత్‌ను కొనుగోలును తప్పనిసరి చేసింది.

Published : 07 Mar 2023 19:41 IST

దిల్లీ: దేశంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే థర్మల్‌ ప్లాంట్లకు సంబంధించి కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కొత్తగా థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలంటే  అందులో 40 శాతం వాటాకు సమానమైన పునరుత్పాదక విద్యుత్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొంది. లేదంటే అంతమొత్తానికి సమానమైన విద్యుత్‌ కొనుగోలు చేయాలని పేర్కొంది. కొత్తగా ఏర్పాటు చేయబోయే పవర్‌ ప్లాంట్లకు ఈ నిబంధన తప్పనిసరి చేసింది. ఈ మేరకు ఎలక్ట్రిసిటీ యాక్ట్‌ 2003లోని టారిఫ్‌ పాలసీ 2016ని ఇంధన మంత్రిత్వ శాఖ సవరించింది.

‘‘2023 ఏప్రిల్‌ 1 తర్వాత కోల్‌/లిగ్నైట్‌ ఆధారిత థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటే పునరుత్పాదక కొనుగోలు బాధ్యత కింద గ్రీన్ ఎనర్జీని ఉత్పాదక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. లేదంటే థర్మల్ జనరేటింగ్ స్టేషన్ సామర్థ్యంలో 40 శాతానికి సమానమైన పునరుత్పాదక విద్యుత్‌ను సేకరించి సరఫరా చేయాలి’’ అని ఇంధన మంత్రిత్వ శాఖ సూచించింది. 2023 ఏప్రిల్‌ 1 నుంచి 2025 మార్చి 31 వరకు ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపింది. 2025 తర్వాత ఏర్పాటు చేయబోయే ప్లాంట్లకు రెన్యూవబుల్ జనరేషన్ ఆబ్లిగేషన్ కింద 40 శాతం విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలిపింది. అయితే, సొంత బొగ్గు గనులు కలిగిన విద్యుత్‌ ఉత్పత్తి కంపెనీలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని