Ramoji rao: పారిశ్రామికవేత్తలకూ మార్గదర్శి రామోజీ

రామోజీరావు కేవలం జర్నలిజంలోనే కాదు.. పారిశ్రామికవేత్తలకూ మార్గదర్శేనని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. వినూత్నత కోసం నిరంతరం శ్రమించడం, సమయ పాలన వంటివి  రామోజీరావు నుంచి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు అలవర్చుకుంటే, వృద్ధి సాధ్యమని వివరించారు.

Updated : 09 Jun 2024 07:06 IST

రామోజీరావు కేవలం జర్నలిజంలోనే కాదు.. పారిశ్రామికవేత్తలకూ మార్గదర్శేనని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. వినూత్నత కోసం నిరంతరం శ్రమించడం, సమయ పాలన వంటివి  రామోజీరావు నుంచి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు అలవర్చుకుంటే, వృద్ధి సాధ్యమని వివరించారు. వ్యాపార రంగంలో ఆయన చేసిన కృషి ఎంతో స్ఫూర్తిదాయకమని, ప్రజలకు మంచి చేయడంలోనూ ఎప్పుడూ ముందుండేవారని ఎస్‌ఎంఎస్‌ ఫార్మా మేనేజింగ్‌ డైరెక్టర్‌ పి.రమేశ్‌ బాబు తెలిపారు. రామోజీరావు పార్థివదేహాన్ని సందర్శించి, నివాళులు అర్పించిన వాణిజ్య ప్రముఖుల్లో నవయుగ గ్రూప్‌ ఛైర్మన్‌ సి.విశ్వేశ్వరరావు, ఎస్‌ఈసీ ఇండస్ట్రీస్‌ ఎండీ డి.విద్యాసాగర్, జెమినీ కిరణ్, ప్రముఖ పారిశ్రామిక వేత్త బొల్లినేని కృష్ణయ్య, ఆర్‌వీఆర్‌ ప్రాజెక్ట్స్‌ ఎండీ రాయల రఘు, సెల్‌కాన్‌ ఎండీ వై.గురు, జెన్‌ సెక్యూరిటీస్‌ జాయింట్‌ ఎండీ కంతేటి సతీష్, అలేఖ్య హోమ్స్‌ అధినేత శ్రీనాధ్, ప్రగతి ప్రింటర్స్‌ సీఈఓ నరేంద్ర, విజ్ఞాన్‌ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య, టెక్‌ ఎరా ఎండీ కిరణ్, ఐలాపురం హోటల్‌ అధిపతి రాజా, పాపులర్‌ షూమార్ట్‌ అధిపతి చుక్కపల్లి అరుణ్‌ కుమార్, తెలంగాణ చిట్‌ఫండ్‌ ఫెడరేషన్‌ ప్రతినిధులు ఉన్నారు.

మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌ను పరామర్శిస్తున్న ఎస్‌ఈసీ ఇండస్ట్రీస్‌ ఎండీ డి.విద్యాసాగర్, జెమినీ కిరణ్‌ 

పత్రికా స్వేచ్ఛ కోసం అవిశ్రాంత పోరాటం

‘తెలుగు వెలుగు’ రామోజీరావు మరణం జాతికి తీరని లోటు. మీడియా రంగంలో తిరుగులేని వ్యక్తి. పత్రికా స్వేచ్ఛ కోసం ఆయన అవిశ్రాంత పోరాటం చేశారు. ఎంతోమంది వ్యాపారవేత్తలకు ఒక మార్గదర్శి. ఆయన వృత్తి నైపుణ్యం, అంకితభావం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆసోసియేటెడ్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (అసోచామ్‌) అంధ్రప్రదేశ్, తెలంగాణ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ బృందం రామోజీరావుకు నివాళులర్పిస్తోంది.

కటారు రవికుమార్‌ రెడ్డి, ఛైర్మన్,  ఆసోచామ్‌ ఏపీ, తెలంగాణ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌

రామోజీరావు పార్థివదేహానికి నివాళి అర్పిస్తున్న అలేఖ్య హోమ్స్‌ అధినేత శ్రీనాధ్, ప్రగతి ప్రింటర్స్‌ సీఈఓ నరేంద్ర

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని