బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బంధన్‌ బ్యాంక్‌కు RBI జరిమానా

RBI: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రెండు ప్రముఖ బ్యాంకులపై భారీ మొత్తంలో జరిమానా విధించింది. నిబంధనలు పాటించనందుకు ఈ పెనాల్టీ వేసింది.

Published : 13 Mar 2024 23:26 IST

ముంబయి: ప్రముఖ బ్యాంకులైన బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (Bank of India), బంధన్‌ బ్యాంక్‌ (Bandhan Bank)పై రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (RBI) కొరడా ఝళిపించింది. రెగ్యులేటరీ నిబంధనలు పాటించనందుకు గానూ భారీ జరిమానా విధించినట్లు బుధవారం వెల్లడించింది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాపై రూ.1.4 కోట్లు, బంధన్‌ బ్యాంక్‌పై రూ.29.55 లక్షలు పెనాల్టీ వేసింది.

డిపాజిట్లపై వడ్డీ రేటు, కస్టమర్‌ సర్వీసులు, అడ్వాన్స్‌లపై వడ్డీ రేట్లు, క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీ నియమాలు 2006కు సంబంధించి ఆర్‌బీఐ జారీ చేసిన నిబంధనలు పాటించనందున బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాపై జరిమానా విధించింది. మోసాలను పర్యవేక్షించడం, కేవైసీ ఆదేశాల్లో కొన్ని నిబంధనలను పాటించనందుకు ఇండోస్టార్ క్యాపిటల్ ఫైనాన్స్ లిమిటెడ్‌పై కూడా రూ.13.60 లక్షల పెనాల్టీ విధించినట్లు ఆర్‌బీఐ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని