Digital payments: డిజిటల్‌ చెల్లింపుల ధ్రువీకరణకు మరో కొత్త విధానం

Digital payment in new way: డిజిటల్‌ లావాదేవీల ధ్రువీకరణ కోసం కొత్త విధానం అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది.

Published : 08 Feb 2024 15:32 IST

Digital transactions | ముంబయి: ఏదైనా ఆన్‌లైన్‌ లావాదేవీ (Digital payments) చేసినప్పుడు.. ఆ పేమెంట్‌ను ధ్రువీకరించడానికి ఓటీపీని (OTP) వినియోగిస్తుంటాం. దాదాపు అన్ని బ్యాంకులూ ఈ విధానాన్నే అనుసరిస్తున్నాయి. అయితే, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) త్వరలో డిజిటల్‌ చెల్లింపుల ధ్రువీకరణకు మరో కొత్త మెకానిజాన్ని అందుబాటులోకి తేనుంది. డిజిటల్‌ చెల్లింపుల విధానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా, ఈతరహా చెల్లింపులకు మరింత భద్రత కల్పించే ఉద్దేశంతో ఈ విధానాన్ని తీసుకురానున్నారు. ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాల వెల్లడి సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్‌ ఈ విషయాన్ని తెలియజేశారు.

డిజిటల్‌ చెల్లింపులకు కొన్నేళ్లుగా ఆర్‌బీఐ ప్రాధాన్యం ఇస్తోంది. ముఖ్యంగా ఈతరహా లావాదేవీల భద్రత కోసం అడిషనల్‌ ఫ్యాక్టర్‌ ఆఫ్‌ అథంటికేషన్‌ను బ్యాంకులకు సూచించింది. దీంతో చాలావరకు బ్యాంకులు ఓటీపీ ఆధారిత విధానాన్ని అనుసరిస్తున్నాయి. అయితే, సాంకేతికత వృద్ధి చెందుతున్న వేళ పలు ప్రత్యామ్నాయ విధానాలు అందుబాటులోకి వచ్చాయని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. డిజిటల్‌ చెల్లింపులకు మరింత భద్రత తీసుకొచ్చేందుకు గానూ విధిగా అనుసరించేలా కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను తీసుకొస్తామని చెప్పారు. దీనికి సంబంధించి విడిగా ఆదేశాలు జారీ చేస్తామన్నారు. డిజిటల్‌ లావాదేవీలు జరపడానికి ఓటీపీకి ప్రత్యామ్నాయ విధానాలను సూచించొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కైనటిక్‌ ఇ-లూనా వచ్చేసింది.. సింగిల్‌ ఛార్జ్‌తో 110km

ఆఫ్‌లైన్‌లో ఇ-రూపీ లావాదేవీలు

ఇంటర్నెట్‌ అందుబాటులో లేని సందర్భాల్లోనూ ఆఫ్‌లైన్‌లో డిజిటల్‌ రూపీ లావాదేవీలను నిర్వహించే వెసులుబాటును ఆర్‌బీఐ తీసుకురానుంది. సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ పైలట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ విధానాన్ని వినియోగించుకోవచ్చని శక్తికాంత దాస్‌ చెప్పారు. ఆఫ్‌లైన్‌ మోడ్‌ను కొండ, గ్రామీణ ప్రాంతాల్లో పరీక్షించనున్నట్లు తెలిపారు. సీబీడీసీ రిటైల్‌ లావాదేవీలను పైలట్‌ ప్రాజెక్ట్‌ను 2022 డిసెంబర్‌లో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బ్యాంకులు వ్యక్తుల నుంచి వ్యక్తులకు (P2P), వ్యక్తుల నుంచి వ్యాపారులకు (P2M) లావాదేవీలు నిర్వహించుకునే అవకాశం కల్పిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని