Personal loans: పర్సనల్ లోన్స్‌పై ఆర్బీఐ కీలక నిర్ణయం
RBI on personal loans: వ్యక్తిగత రుణాలపై ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ తరహా రుణాలపై రిస్క్ వెయిట్ 25 పాయింట్లు పెంచింది. దీంతో ఆ కేటగిరీ రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు వెనుకంజ వేయనున్నాయి.
ముంబయి: వ్యక్తిగత రుణాలకు (Personal loans) సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. పూచీకత్తు అవసరం లేని ఈ రుణాల విషయంలో బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు నిబంధనలను కఠినతరం చేసింది. ఈ తరహా రుణాల రిస్క్ వెయిట్‌ను (Risk weight) 25 శాతం పాయింట్లను పెంచింది. అయితే గృహ, విద్య, వాహన రుణాలు సహా కొన్ని కన్జూమర్ లోన్లను దీన్నుంచి మినహాయించింది. అలాగే, బంగారం, బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి తీసుకునే రుణాలకూ ఈ రిస్క్ వెయిట్ వర్తించదు. ఆయా రుణాలకు 100 శాతం రిస్క్ వెయిట్‌ను కొనసాగించింది.
‘‘కమర్షియల్ బ్యాంక్స్ ఇచ్చే వినియోగ రుణాలపై సమీక్షించాక రిస్క్ వెయిట్‌ను పెంచాలని నిర్ణయించాం. 25 శాతం పాయింట్లను పెంచి 125 శాతానికి చేర్చాం. దీన్నుంచి గృహ, విద్యా, వాహన రుణాలను మినహాయిస్తున్నాం. బంగారం కుదువ పెట్టి తీసుకునే రుణాలకు ఈ మినహాయింపు వర్తిస్తుంది’’ అని ఆర్బీఐ గురువారం ఓ సర్క్యులర్ జారీ చేసింది. హై రిస్క్ వెయిట్ అంటే.. నష్టభయం అన్నమాట. ఈ వెయిట్‌ను పెంచడం అంటే ఆ మేర ఈ కేటగిరీ రుణాలకు బ్యాంకులు బఫర్‌గా ఉంచే సొమ్మును మరింత కేటాయించాల్సి ఉంటుంది. ఓ విధంగా బ్యాంకులు ఈ తరహా రుణాలు జారీని పరిమితం చేయడం అన్నమాట.
పర్సనల్ లోన్‌తో మీ క్రెడిట్‌స్కోరు దెబ్బతింటుందా?
కరోనా తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థలో వేగంగా మార్పులు వచ్చాయి. ఫిన్‌టెక్ అంకురాలు కొత్త సాంకేతికతను మరింత అభివృద్ధి చేసి, క్షణాల్లో అప్పులు ఇచ్చేస్తున్నాయి. బ్యాంకులూ ఇదే పంథాను అనుసరిస్తున్నాయి. ఫలితంగా బ్యాంకుల రిటైల్ రుణాలు వేగంగా వృద్ధి చెందాయి. బ్యాంకులు అందిస్తున్న మొత్తం రుణాల్లో ఈ హామీ లేని రుణాల వాటా గత కొంతకాలంగా భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అన్సెక్యూర్డ్ రుణాల విషయంలో బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు. జులై, ఆగస్టు నెలల్లో ప్రధాన బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల ఎండీ/ సీఈఓలతో నిర్వహించిన సమావేశంలో దీనిపై ఆందోళన వ్యక్తంచేశారు. హామీ లేని రుణాలు బాగా పెరుగుతున్నాయని, బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు అంతర్గతంగా వీటిని కట్టడి చేసే విషయంపై దృష్టి పెట్టాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి.. సుందర్ పిచాయ్‌కి గౌరవ డాక్టరేట్
Sundar Pichai: భారత్‌లోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. -
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
Stock market: దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1292, నిఫ్టీ 428 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
TIME Greatest Places: హోటళ్లు, క్రూజ్‌లు, రెస్టారంట్లు, పర్యటక స్థలాలు, మ్యూజియంలు, పార్క్‌లను పరిగణనలోకి తీసుకొని టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని 100 గొప్ప ప్రదేశాల జాబితాను విడుదల చేసింది. -
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
Gold price: బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆ దుకాణాల్లో ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. -
గూగుల్‌కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్‌జీపీటీ ఓనర్
SearchGPT: గూగుల్‌కు పోటీగా ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చింజిన్‌ను తీసుకొచ్చింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది. -
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
ITR filing: ఐటీఆర్ ఫైలింగ్‌లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దాఖలు గడువు ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నాయి. -
జియో ఫ్రీడమ్ ఆఫర్.. ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లపై 30% తగ్గింపు
Jio Freedom Offer: ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్ల ఇన్స్టాలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇది పరిమితకాల ఆఫర్. -
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
Job Trends: ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే ఉద్యోగాలు ఇకపై కనుమరుగవుతాయని లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అంచనా వేశారు. -
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (7)
సంక్షిప్త వార్తలు -
ఆదాయపు పన్ను ఫారం-16 లేకున్నా రిటర్నులు
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) జులై 31తో గడువు ముగియనుంది. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్‌రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి.. సుందర్ పిచాయ్‌కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం