Illegal Forex Trading: చట్ట విరుద్ధ ఫారెక్స్‌ ట్రేడింగ్‌పై ఆర్‌బీఐ ఉక్కుపాదం

అక్రమ ఫారెక్స్‌ ట్రేడింగ్‌కు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఆర్‌బీఐ చర్యలు చేపడుతోంది.

Published : 25 Dec 2023 20:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్: అక్రమ ఫారెక్స్‌ ట్రేడింగ్‌ను ఎదుర్కోవడానికి ఆర్‌బీఐ కఠిన చర్యల దిశగా ముందుకెళుతోంది. అనధికారిక ఫారెక్స్‌ లావాదేవీల్లో పాల్గొన్న ప్లాట్‌ఫామ్స్‌, వెబ్‌సైట్‌లతో సహా 75 సంస్థలను ఆర్‌బీఐ గుర్తించింది. అక్రమ ఫారెక్స్‌ ట్రేడింగ్‌ కోసం బ్యాంకింగ్‌ ఛానెళ్లను దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికి ఆర్‌బీఐ... బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో అక్రమ ఫారెక్స్‌ ట్రేడింగ్‌ కార్యకలాపాలకు సంబంధించి ఇద్దరు వ్యాపారవేత్తలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్ట్‌ చేసింది. కోల్‌కతాలో ఉన్న నిందితులు... 180 బ్యాంకు ఖాతాలను నియంత్రించి, నిర్వహించారని దర్యాప్తులో తెలిపింది. అంతేకాకుండా సోషల్‌ మీడియా, సెర్చ్‌ ఇంజిన్లు, గేమింగ్‌ యాప్స్‌, ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో తప్పుదారి పట్టించే ప్రకటనలను ఆర్‌బీఐ గుర్తించింది. కొన్ని సంస్థలు గుర్తింపు లేని ప్లాట్‌ఫామ్స్‌లో ఫారెక్స్‌ లావాదేవీలను జరుపుతున్నాయని, ఇవి ఫారిన్‌ ఎక్స్‌ఛేంజ్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌, 1999 (ఫెమా) ప్రకారం చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆర్‌బీఐ హెచ్చరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని