Retail inflation: తగ్గిన రిటైల్‌ ద్రవ్యోల్బణం.. అయినా 6 శాతం ఎగువనే!

వినియోగదారుల సూచీ ఆధారిత (CPI) రిటైల్‌ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. అక్టోబర్‌ నెలలో 6.77 శాతంగా నమోదైంది.

Published : 14 Nov 2022 22:57 IST

దిల్లీ:  వినియోగదారుల ధరల సూచీ ఆధారిత (CPI) రిటైల్‌ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. అక్టోబర్‌ నెలలో 6.77 శాతంగా నమోదైంది. అంతకుముందు నెల ఇది 7.41 శాతంగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర గణాంక కార్యాలయం (NSO) సోమవారం కీలక గణాంకాలను విడుదల చేసింది. ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పట్టడంతో రిటైల్‌ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినా.. ఆర్‌బీఐ నిర్దేశించుకున్న సౌకర్యవంతమైన స్థాయి (2-6 శాతం)కి పైనే ఉండడం గమనార్హం. 

ఈ ఏడాది జనవరి నుంచి రిటైల్‌ ద్రవ్యోల్బణం 6 శాతానికి పైనే ఉంటోంంది. అంటే గడిచిన 10 నెలల నుంచి రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్ష్యానికి దూరంగానే ఉంటోంది. ఇక ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 8.6 శాతం నుంచి 7.01 శాతానికి తగ్గింది. అంతకుముంందు టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణ గణాంకాలను కేంద్రం విడుదల చేసింది. అక్టోబర్‌ నెలలో 8.39 శాతంగా నమోదైంది. ఇది 19 నెలల కనిష్ఠంగా నమోదు కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని