Multiplexes: తగ్గనున్న మల్టీప్లెక్స్‌ల ఆదాయం?

2025 ఆర్థిక సంవత్సరంలో మల్టీప్లెక్స్‌ల ఆదాయ వృద్ధి 15 శాతానికి తగ్గవచ్చని క్రిసిల్‌ రేటింగ్స్‌ నివేదిక తెలిపింది.

Published : 28 Feb 2024 18:29 IST

దిల్లీ: మల్టీప్లెక్స్‌ల ఆదాయ వృద్ధి 2023-24 ఆర్థిక సంవత్సరంలో 20-24% వరకు ఉండొచ్చని అంచనా. ఇది 2024-25 ఆర్థిక సంవత్సరంలో 10-15 శాతానికి తగ్గొచ్చని దేశీయ రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ బుధవారం తెలిపింది. లాభాల మార్జిన్లు స్వల్పంగా పెరగవచ్చని పేర్కొంది. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వంటి అగ్రశ్రేణి సర్వీస్‌ ప్రొవైడర్ల నుంచి పరిశ్రమ ఎదుర్కొంటున్న పోటీ కారణంగా ప్రీ-పాండమిక్‌ స్థాయిల కంటే తక్కువగానే కొనసాగవచ్చని క్రిసిల్‌ రేటింగ్స్‌ నివేదిక తెలిపింది. మల్టీప్లెక్స్‌ల ఆదాయం 2024-25 ఆర్థిక సంవత్సరంలో 10-15% వృద్ధితో రూ.7,300 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని