Cashback offer: రూపే క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌.. ఈరోజే లాస్ట్‌డేట్‌!

New Year Cashback offer: కొత్త సంవత్సరం నేపథ్యంలో రూపే ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది.

Updated : 01 Jan 2024 13:09 IST

New Year Cashback offer | దిల్లీ: ప్రముఖ ఆర్థిక సంస్థ రూపే (RuPay) కొత్త సంవత్సరం వేళ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ (Cashback offer) ప్రకటించింది. యూపీఐతో లింక్‌ చేసిన క్రెడిట్‌ కార్డులతో చేసిన లావాదేవీలపై రూ.3,000 వరకు క్యాష్‌బ్యాక్‌ లభించనుంది. డిసెంబర్‌ 30 నుంచే అందుబాటులోకి వచ్చిన ఈ ఆఫర్‌ ఈరోజు (2024 జవనరి 1) ముగియనుంది. కనీసం రూ.7,500 ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలా అయితేనే రూ.3,000 వరకు క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. ఈ మొత్తం కస్టమర్ల ఖాతాలో 30 రోజుల్లోపు క్రెడిట్‌ అవుతుంది. దుస్తులు, ఎలక్ట్రానిక్స్‌, ట్రావెల్‌, జువెలరీ, ఎయిర్‌లైన్స్‌, హోటల్స్‌, డైనింగ్‌ కేటగిరీలపై చేసే వ్యయాలకు మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని