KPMG Survey: జీవన వ్యయం ఆధారంగా జీతం నిర్ణయించరు

ఒకటే తరహా హోదాలో పనిచేసే ఉద్యోగులకు దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఇంచుమించు సమాన స్థాయిలోనే పారితోషికం ఉంటోందని కేపీఎంజీ నిర్వహించిన సర్వేలో తేలింది.

Published : 09 Jun 2024 03:28 IST

ఒకే తరహా ఉద్యోగానికి దేశవ్యాప్తంగా ఒకటే వేతన శ్రేణి 
కేపీఎంజీ సర్వేలో హెచ్‌ఆర్‌ మేనేజర్లు

దిల్లీ: ఒకటే తరహా హోదాలో పనిచేసే ఉద్యోగులకు దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఇంచుమించు సమాన స్థాయిలోనే పారితోషికం ఉంటోందని కేపీఎంజీ నిర్వహించిన సర్వేలో తేలింది. వివిధ నగరాల మధ్య జీవన వ్యయాల్లో వ్యత్యాసాలున్నా, వేతన నిర్ణయాలపై అవి ప్రభావం చూపవని 95% మంది మానవ వనరుల (హెచ్‌ఆర్‌) విభాగ మేనేజర్లు తెలిపినట్లు నివేదిక పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో నిర్వహించిన ఈ సర్వేలో మొత్తం 10 రంగాల్లోని 40 కంపెనీలకు చెందిన నియామకాల విభాగం, మానవ వనరుల విభాగ మేనేజర్లు తమ అభిప్రాయాలు తెలిపారు.

‘గతంలో మెట్రో నగరాలు, ప్రథమ శ్రేణి నగరాల్లో అధిక జీవన వ్యయాలను దృష్టిలో ఉంచుకుని, సిటీ కంపెన్సేటరీ అలవెన్స్‌లను కంపెనీలు ఇచ్చేవి. ఇప్పుడు కొన్ని కంపెనీలు మాత్రమే ఈ విధానాన్ని పాటిస్తున్నాయ’ని హెచ్‌ఆర్‌ మేనేజర్లు తెలిపారు. జీవన వ్యయాన్ని లెక్కించేందుకు ఇంటి అద్దె, స్థిరాస్తి సూచీ, కొనుగోలు శక్తితో పాటు వస్తువులు, రవాణా, సామగ్రి తదితర వాటికయ్యే రోజువారీ ఖర్చులను లెక్కలోకి తీసుకుంటారు. 

  • భద్రతాపరంగా పుణె అత్యుత్తమ నగరంగా ఉందని సర్వే గుర్తించింది. భద్రత విషయంలో పుణె, చెన్నె, నవీ ముంబయి, పుణె సురక్షిత వాతావరణాన్ని కలిగి ఉన్నాయని తెలిపింది. 
  • భద్రత తర్వాత జీవన ప్రమాణాలపై ప్రభావం చూపించే కీలక అంశాల్లో రవాణా సదుపాయం, ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లేందుకు పట్టే సమయం, ఆరోగ్య సంరక్షణ, గాలి నాణ్యత లాంటివి ఉన్నాయని వెల్లడించింది. నీ వాణిజ్య అద్దెల విషయంలో నవీ ముంబయి, హైదరాబాద్, చెన్నైలలో పోటీవాతావరణం నెలకొందని పేర్కొంది.
  • గురుగ్రామ్, నవీ ముంబయి, నోయిడా లాంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో నియమించుకుంటున్న ఉద్యోగుల నైపుణ్యాలపై కంపెనీలు అత్యంత సంతృప్తికరంగానే ఉన్నాయని సర్వే తెలిపింది. ఈ నగరాల్లో వలసల రేటు అత్యంత తక్కువగా ఉంటోంది.

 

 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని