samsung galaxy f55: గెలాక్సీ ఎఫ్‌55

శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ దేశీయ తయారీ స్మార్ట్‌ఫోన్‌ గెలాక్సీ ఎఫ్‌ 55 5జీని విడుదల చేసింది. వెనకాల లెదర్‌ ప్యానెల్‌తో, సూపర్‌ అన్‌మోల్డ్‌+ డిస్‌ప్లే, 7జెన్‌ ప్రాసెసర్, 45 వాట్‌ సూపర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది.

Published : 28 May 2024 02:34 IST

ఈనాడు, హైదరాబాద్‌: శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ దేశీయ తయారీ స్మార్ట్‌ఫోన్‌ గెలాక్సీ ఎఫ్‌ 55 5జీని విడుదల చేసింది. వెనకాల లెదర్‌ ప్యానెల్‌తో, సూపర్‌ అన్‌మోల్డ్‌+ డిస్‌ప్లే, 7జెన్‌ ప్రాసెసర్, 45 వాట్‌ సూపర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది. నాలుగు తరాల ఆండ్రాయిడ్‌ అప్‌డేట్‌లను,  అయిదేళ్ల పాటు సెక్యూరిటీ ఆప్‌డేట్లు లభించే ఈ ఫోన్‌ రూ.26,999, రూ.29,999, రూ.32,999 ధరల్లో లభిస్తుందని శాంసంగ్‌ ఎంఎక్స్‌ డివిజన్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజు పుల్లన్‌ తెలిపారు. ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్‌ పోర్టళ్లతో పాటు, ఎంపిక చేసిన రిటైల్‌ స్టోర్లలోనూ ఈ ఫోన్‌ కొనుగోలు చేయొచ్చన్నారు.   పరిమిత వ్యవధి ఆఫర్‌గా 45 వాట్‌ శాంసంగ్‌ ట్రావెల్‌ అడాప్టర్‌ను రూ.499కి లేదా గెలాక్సీ ఫిట్‌ 3 ని రూ.1,999కి కొనుగోలు చేయొచ్చని పేర్కొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని