SBI share: సుప్రీం తీర్పు ఎఫెక్ట్‌.. ఎస్‌బీఐ షేర్‌ విలువ పతనం!

ఎన్నికల బాండ్లపై సుప్రీం కోర్టు (Supreme Court)లో ఎస్‌బీఐకి చుక్కెదురైన నేపథ్యంలో ఆ బ్యాంకు షేర్‌ ధర ఒకే రోజు 2శాతం క్షీణించింది.

Published : 11 Mar 2024 13:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎన్నికల బాండ్ల వివరాల వెల్లడికి అదనపు సమయం ఇచ్చేది లేదని భారతీయ స్టేట్‌ బ్యాంకుకు సుప్రీం కోర్టు (Supreme Court) స్పష్టం చేయడం సదరు బ్యాంకు షేర్ల విక్రయాలపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఉదయం నుంచి ఎస్‌బీఐ షేర్ల అమ్మకాల జోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో షేర్‌ ధర మధ్యాహ్నం ఒంటిగంట వరకు 2శాతం క్షీణించింది. సోమవారం ఉదయం రూ.788.5 ధరతో ప్రారంభమైన షేర్‌.. మధ్యాహ్నానికి రూ.16 కోల్పోయింది. ప్రస్తుతం రూ. 772 వద్ద ట్రేడింగ్‌ అవుతోంది. ఒకేరోజు ఈస్థాయిలో పడిపోవడం ఫిబ్రవరి 12 తర్వాత ఇదే తొలిసారి అని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఎన్నికల బాండ్ల(Electoral Bonds) వివరాల వెల్లడించేందుకు ఎస్‌బీఐ అదనపు సమయం కోరడంపై సుప్రీంకోర్టు(Supreme Court) తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. బ్యాంకు చేసిన అభ్యర్థనను తోసిపుచ్చుతూ.. మార్చి 12లోగా విరాళాల వివరాలు ఎన్నికల సంఘానికి వెల్లడించాల్సిందేనని ఆదేశించింది. అలాగే ఆ సమాచారాన్ని మార్చి 15 సాయంత్రం 5 గంటల్లోగా వెల్లడించాలని ఈసీని ఆదేశించింది. ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడి చేయడానికి గడువును జూన్‌ 30 వరకూ పొడిగించాలంటూ ఎస్‌బీఐ దాఖలు చేసిన పిటిషన్‌ తిరస్కరణకు గురికావడం షేర్‌ విలువపై ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని