SBI: ఎస్‌బీఐ డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి

SBI Debit Card Charges: ఏప్రిల్‌ నుంచి ఎస్‌బీఐ డెబిట్‌ కార్డు నిర్వహణ ఛార్జీలను పెంచనుంది. కొత్త ఛార్జీలెలా ఉన్నాయో చూద్దాం..!

Updated : 27 Mar 2024 14:36 IST

SBI Debit Card Charges | ముంబయి: దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐ తమ డెబిట్‌కార్డు నిర్వహణ ఛార్జీలను సవరించింది. గరిష్ఠంగా రూ.75 (జీఎస్‌టీ అదనం) వరకు పెంచింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. 

ఎస్‌బీఐ (SBI) వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం ప్రస్తుతం క్లాసిక్‌, గ్లోబల్‌, కాంటాక్ట్‌లెస్‌ డెబిట్‌ కార్డులపై బ్యాంకు రూ.125 (జీఎస్‌టీ అదనం) వసూలు చేస్తోంది. ఏప్రిల్‌ నుంచి దీన్ని రూ.200 చేసింది. యువ, గోల్డ్‌, కాంబో కార్డులపై ఇప్పుడు రూ.175 ఛార్జీ ఉండగా.. దాన్ని కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి రూ.250కు సవరించింది. అలాగే ప్లాటినం డెబిట్‌ కార్డు ఛార్జీని రూ.250 నుంచి రూ.325కు పెంచింది. ప్రైడ్‌, ప్రీమియం బిజినెస్‌ కార్డుపై రూ.350 వార్షిక నిర్వహణ ఛార్జీలను వసూలు చేస్తుండగా.. దాన్ని రూ.425కు సవరించింది. కొత్త ఛార్జీలన్నింటికీ జీఎస్‌టీ అదనం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని