SBI Results: రాణించిన ఎస్‌బీఐ.. లాభం రూ.16వేల కోట్లు

SBI q2 Results: త్రైమాసిక ఫలితాల్లో ఎస్‌బీఐ రాణించింది. రూ.16వేల కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది కంటే 9 శాతం  వృద్ధి నమోదైంది.

Published : 04 Nov 2023 15:09 IST

దిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) మెరుగైన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో (Q2 results) రూ.16,099.58 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.14,752 కోట్ల నికర లాభంతో పోలిస్తే 9.13 శాతం వృద్ధిని నమోదు చేసింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.18,356 కోట్లతో పోలిస్తే లాభం స్వల్పంగా తగ్గింది. స్టాండలోన్‌ పద్ధతిన నికర లాభం రూ.13,264.52  కోట్ల నుంచి రూ.14,330.02 కోట్లకు పెరిగింది.

మెరుగైన సౌకర్యాలతో రైల్వే స్టేషన్‌లోనే రూమ్‌.. ఎలా బుక్‌ చేసుకోవాలంటే..?

దేశంలో ఐదో వంతు మార్కెట్‌ వాటాను కలిగి ఉన్న ఎస్‌బీఐ మొత్తం ఆదాయం సైతం సమీక్షా త్రైమాసికంలో రూ.88,733 కోట్ల నుంచి రూ.1.12 లక్షల కోట్లకు పెరిగింది. స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి (NPA) 3.52 నుంచి 2.55 శాతానికి తగ్గింది. తొలి త్రైమాసికంలో ఎన్‌పీఏలు 2.76 శాతంగా ఉన్నాయి. క్యాపిటల్‌ అడిక్వసీ 14.28 శాతంగా ఉంది. శుక్రవారం మార్కెట్‌ ముగిసే సమయానికి ఎస్‌బీఐ షేర్లు ఎన్‌ఎస్‌ఈలో 1 శాతం లాభంతో రూ.578.15 వద్ద ముగిశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని