Google: రూ.1337 కోట్ల జరిమానా.. గూగుల్‌కు సుప్రీంలో ఎదురుదెబ్బ!
జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ తీర్పుపై స్టే విధించాలని కోరూతూ గూగుల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. జరిమానాలో 10శాతాన్ని వారం రోజుల్లోగా జమ చేయాలని సుప్రీం ఆదేశించింది.
దిల్లీ: అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజం గూగుల్ (Google)కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ (NCLAT) తీర్పును వ్యతిరేకిస్తూ గూగుల్ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత ధర్మాసనం కొట్టివేసింది. ఆండ్రాయిడ్ (Android) ఉత్పత్తులకు సంబంధించి తన ఆధిపత్యాన్ని గూగుల్ దుర్వినియోగం చేస్తోందని, అనైతికంగా, పోటీ చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందంటూ కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) గతంలో రూ.1,337 కోట్ల జరిమానా విధించింది. దీనిపై గూగుల్ ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించింది. అక్కడ వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. జరిమానాలో 10 శాతం మొత్తాన్ని నాలుగు వారాల్లోగా జమ చేయాలని ఆదేశించింది.
ఎన్సీఎల్ఏటీ తీర్పుపై స్టే విధించాలని కోరుతూ.. గూగుల్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై తాజాగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ జేబీ పార్దివాలా త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. కేసును తిరిగి ఎన్సీఎల్ఏటీకి అప్పగించింది. మార్చి 31లోగా కేసును పూర్తి చేయాలని తెలిపింది. గతంలో సీసీఐ విధించిన అపరాధ రుసుములో 10శాతం చెల్లించేందుకు గూగుల్‌కు వారం రోజులు గడువిచ్చింది. మరోవైపు కేసు విచారణ కోసం గురువారం నుంచి 3 రోజుల్లోగా ఎన్సీఎల్ఏటీని సంప్రదించాలని గూగుల్‌ను సుప్రీం కోర్టు ఆదేశించింది. సీసీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్ వెంకటరమణన్ గతంలో వాదనలు వినిపించారు. గూగుల్ సంస్థ ఐరోపా దేశాల్లో ఒక విధంగా, భారత్‌లో మరోలా వ్యవహరిస్తోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. యూరోపియన్ కమిషన్ ఆదేశాలను గూగుల్ పాటిస్తోందని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్‌కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్‌లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్‌లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల