విదేశీ ఫండ్ల ఆస్తుల్లో 20% వరకే మన మార్కెట్లకు! : సెబీ ప్రతిపాదన

మ్యూచువల్‌ ఫండ్లలో విదేశీ పెట్టుబడులను మరింత సులభతరం చేసే దిశగా మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ కొన్ని చర్యలను ప్రతిపాదించింది.

Published : 18 May 2024 01:07 IST

దిల్లీ: మ్యూచువల్‌ ఫండ్లలో విదేశీ పెట్టుబడులను మరింత సులభతరం చేసే దిశగా మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ కొన్ని చర్యలను ప్రతిపాదించింది. అంతర్జాతీయ ఫండ్లు తమ పెట్టుబడిలో కొంత మొత్తాన్ని భారతీయ షేర్లలో మదుపు చేస్తున్నాయి. విదేశీ ఫండ్లలో మదుపు చేసే ఫండ్‌ ఆఫ్‌ ఫండ్లు దేశీయ మార్కెట్లకు కేటాయించే మొత్తం, వాటి మొత్తం నికర పెట్టుబడిలో 20 శాతానికి మించకూడదని సెబీ ప్రతిపాదించింది. పెట్టుబడిదారులకు ఖర్చులను తగ్గించడంతో పాటు, భారతీయ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ (ఎఫ్‌ఓఎఫ్‌)ల పనితీరు వాటి పేరుకు తగ్గట్టుగా ఉంచేందుకు ఇది తోడ్పడుతుందని భావిస్తోంది. భారత్‌ బలమైన ఆర్థిక వృద్ధి అవకాశాలను పరిగణనలోకి తీసుకుని, దేశీయ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసేందుకు పలు విదేశీ ఫండ్లు ముందుకు వస్తున్నాయి. ఈటీఎఫ్‌లు, మ్యూచువల్‌ ఫండ్లు, యూనిట్‌ ట్రస్టులు తమ పెట్టుబడుల్లో కొంత భాగాన్ని భారతీయ సెక్యూరిటీల కోసం కేటాయిస్తున్నాయని సెబీ పేర్కొంది.

  • ఏప్రిల్‌ 30 నాటికి ఎంఎస్‌సీఐ ఎమర్జింగ్‌ మార్కెట్స్‌ ఇండెక్స్, 18 శాతానికి మించి భారతీయ మార్కెట్లో మదుపు చేసింది. జేపీ మోర్గాన్‌ ఎమర్జింగ్‌ మార్కెట్స్‌ ఆపర్చునిటీస్‌ ఫండ్‌ 15 శాతం పెట్టుబడులు పెట్టింది. పెట్టుబడులను వైవిధ్యం చేయడంలో భాగంగా దేశీయ మ్యూచువల్‌ ఫండ్లూ విదేశీ ఎఫ్‌ఓఎఫ్‌లలో మదుపు చేస్తుంటాయి.
  • విదేశీ ఫండ్లు, దేశీయ అంతర్జాతీయ ఫండ్లకు సంబంధించిన సందిగ్ధతలను తొలగించి, పెట్టుబడిదారులకు అదనపు రక్షణ కలిగించేలా సెబీ ఈచర్యలను ప్రతిపాదించింది. దీనికి సంబంధించి జూన్‌ 7 లోపు తమ అభిప్రాయాలను తెలియజేయాలని ప్రజలను సెబీ కోరింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు