GST collections: మార్చిలో భారీగా జీఎస్టీ వసూళ్లు.. రెండో అత్యధికం ఇదే

GST collections in march: జీఎస్టీ వసూళ్లు మార్చిలో రూ.1.78 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే 11.5 శాతం అధికం.

Updated : 01 Apr 2024 16:58 IST

GST collections| దిల్లీ: దేశంలో వస్తు, సేవల పన్ను వసూళ్లు (GST) మరోసారి భారీగా నమోదయ్యాయి. మార్చి నెలకు గానూ రూ.1.78 లక్షల కోట్ల వసూళ్లు  జరిగినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే వసూళ్లు 11.5 శాతం మేర పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో (2023-24) మొత్తంగా రూ.20.14 లక్షల కోట్ల మేర జీఎస్టీ వసూలైంది.

జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత 2023 ఏప్రిల్‌లో అత్యధికంగా రూ.1.87 లక్షల కోట్లు వసూలైంది. ఆ తర్వాత ఇదే అత్యధికం కావడం గమనార్హం. మొత్తం వసూళ్లలో సీజీఎస్టీ వాటా రూ.34,532 కోట్లు, ఎస్‌జీఎస్టీ రూ.43,746 కోట్లు, ఐజీఎస్టీ రూ.87,947 కోట్లుగా ఉంది. సెస్సుల రూపంలో మరో రూ.12,259 కోట్లు వచ్చింది. అంతకుముందు ఏడాది సగటున నెలకు 1.5 లక్షల కోట్లు చొప్పున జీఎస్టీ వసూళ్లు జరగ్గా.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆ మొత్తం 1.68 లక్షల కోట్లకు పెరిగింది.

రాష్ట్రాల వారీగా చూస్తే తెలంగాణలో గతేడాది మార్చిలో రూ.4804 కోట్ల వసూళ్లు నమోదయ్యాయి. ఈ ఏడాది ఆ మొత్తం 5,399 కోట్లకు పెరిగింది. 12 శాతం వృద్ధి నమోదైంది. ఏపీలో 16 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది రూ.3,532 కోట్లుగా ఉన్న జీఎస్టీ వసూళ్లు రూ.4082 కోట్లకు పెరిగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని