Stock market: 3 రోజుల వరుస లాభాలకు బ్రేక్‌.. 111 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌

Stock market: స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్వల్ప నష్టాలు చవిచూశాయి. సెన్సెక్స్‌ 111 పాయింట్లు, నిఫ్టీ 8 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.

Published : 02 Apr 2024 16:10 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీల లాభాల జోరుకు బ్రేక్‌ పడింది. మూడు రోజుల పాటు వరుసగా లాభపడిన సూచీలు.. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో నష్టాలు చవిచూశాయి. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాలు, గరిష్ఠాల వద్ద మదుపరులు లాభాల స్వీకరణకు దిగడం వంటివి ఇందుక్కారణం. అమెరికాలో తాజాగా వెలువడిన గణాంకాలు వడ్డీ రేట్ల కోత ఆలస్యం కావొచ్చన్న ఆందోళనలు పెంచాయి. ఈ ప్రభావం ఐటీ స్టాక్స్‌పై పడింది.

సెన్సెక్స్‌ 74,022.30 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమై తర్వాత నష్టాల్లోకి జారుకుంది. రోజంతా అదే ఒరవడి కొనసాగింది. ఇంట్రాడేలో 73,743.77 - 74,099.78 మధ్య చలించింది. చివరికి 110.64 పాయింట్లు కోల్పోయి 73,903.91 వద్ద ముగిసింది. నిప్టీ సైతం 8.70 నష్టపోయి 22,453 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.39గా ఉంది.

సెన్సెక్స్‌లో కోటక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, సన్‌ఫార్మా, ఇన్ఫోసిస్‌ షేర్లు నష్టపోయాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా, నెస్లే ఇండియా, టాటా మోటార్స్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ చమురు మరింత పెరిగి 89 డాలర్లకు చేరింది. బంగారం సైతం ఔన్సు 2,278 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని