Stock market: లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 165 పాయింట్లు, నిఫ్టీ 3 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.

Published : 12 Mar 2024 16:15 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. సోమవారం నాటి భారీ నష్టాల నుంచి కోలుకున్నాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమై అదే ఒరవడిని కొనసాగించాయి. ఐటీసీలో బ్రిటిష్‌ అమెరికన్‌ తొబాకో కంపెనీ వాటాలు విక్రయిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఐటీసీ షేర్లు నష్టాలు ఎదుర్కొన్నాయి. అధిక వెయిటేజీ ఉన్న స్టాక్‌ కావడంతో సూచీల పరుగుకు బ్రేక్‌ పడింది.

సెన్సెక్స్‌ ఉదయం 73,516.42 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 73,342.12- 74,4004.16 మధ్య చలించింది. చివరికి 165.32 పాయింట్ల లాభంతో 73,667.96 వద్ద ముగిసింది. నిఫ్టీ 3 పాయింట్ల లాభంతో 22,335.70 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 82.78గా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టీసీఎస్‌, మారుతీ సుజుకీ, ఇన్ఫోసిస్‌, రిలయన్స్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఐటీసీ, టాటా మోటార్స్‌, నెస్లే ఇండియా షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ 82.84 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు 2,181.80 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని