Stock market: లాభాల్లో సూచీలు.. తొలిసారి 75 వేలు ఎగువన సెన్సెక్స్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 354 పాయింట్లు, నిఫ్టీ 111 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.

Updated : 10 Apr 2024 16:42 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో రిలయన్స్‌, ఐటీసీ, ఎయిర్‌టెల్‌ వంటి షేర్లలో కొనుగోళ్లు.. సూచీలకు కలిసొచ్చింది. గత ట్రేడింగ్‌ సెషన్‌లో 75వేల మార్కును దాటిన సెన్సెక్స్‌.. ఇవాళ తొలిసారి 75 వేల ఎగువన ముగిసింది. నిఫ్టీ సైతం 22,700 పైన స్థిరపడింది.

సెన్సెక్స్‌ ఉదయం 74,953.96 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 74,807.55 - 75,105.14 మధ్య ట్రేడయిన సూచీ.. చివరికి 354.45 పాయింట్ల లాభంతో 75,038.15 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 111 పాయింట్ల లాభంతో 22,753.80 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.19గా ఉంది.

సెన్సెక్స్‌లో ఐటీసీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. మారుతీ సుజుకీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా స్టీల్‌ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ చమురు ధర 89.70 డాలర్లు, బంగారం ఔన్సు ధర 2,365.80 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.

  • వచ్చేవారం వొడాఫోన్‌ ఎఫ్‌పీఓ!: ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వొడాఫోన్‌ ఐడియా నిధులు సమీకరించేందుకు సిద్ధమైంది. రూ.20వేల కోట్లతో ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ను (FPO) వచ్చే వారం తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు మార్కెట్‌ రెగ్యులేటర్‌కు సంబంధిత పత్రాలు సమర్పించనుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని