Stock market: తొలిసారి 76k టచ్‌ చేసిన సెన్సెక్స్‌.. ఆఖర్లో లాభాలన్నీ ఆవిరి

Stock market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్‌ 19, నిఫ్టీ 24 పాయింట్లు చొప్పున కోల్పోయాయి.

Published : 27 May 2024 16:30 IST

Stock market | దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం ఆసియా మార్కెట్ నుంచి సానుకూల సంకేతాలతో లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. ఇంట్రాడేలో భారీ లాభాల్లోకి వెళ్లాయి. ఈ క్రమంలో రెండు ప్రధాన సూచీలు సరికొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి. ఓ దశలో 600 పాయింట్ల మేర లాభపడిన సెన్సెక్స్‌.. ఆఖర్లో అమ్మకాల ఒత్తిడితో లాభాలన్నీ కోల్పోయి ఫ్లాట్‌గా ముగిసింది. నిఫ్టీ 22,900 ఎగువన ముగిసింది.

సెన్సెక్స్‌ ఉదయం 75,655.46 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 76,009.68 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాలను నమోదు చేసింది. చివరికి 19.89 పాయింట్ల నష్టంతో 75,390.50 వద్ద ముగిసింది. నిఫ్టీ 24.65 పాయింట్లు కోల్పోయి 22,932.45 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.13గా ఉంది. సెన్సెక్స్‌లో ఇండస్ ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ షేర్లు లాభపడగా.. విప్రో, ఎన్టీపీసీ, సన్‌ఫార్మా, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఐటీసీ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర 82.62 వద్ద ట్రేడవుతుండగా.. ఔన్సు బంగారం ధర 2345.90 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని