Stock Market: ప్రత్యేక ట్రేడింగ్‌ సెషన్‌.. సెన్సెక్స్‌ 88+, నిఫ్టీ @ 22,500

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు శనివారం కొంతసేపు పనిచేశాయి. ఈ ప్రత్యేక సెషన్‌లో సూచీలు లాభపడ్డాయి.

Updated : 18 May 2024 12:52 IST

Stock Market special live trading session I ముంబయి: స్టాక్‌ మార్కెట్లకు నేడు ప్రత్యేక ట్రేడింగ్‌ సెషన్‌ నిర్వహించారు. ఇందులో సూచీలు రాణించాయి. సెన్సెక్స్‌ 74వేల మార్క్‌ను దాటగా.. నిఫ్టీ 22,500 మైలురాయి పైన స్థిరపడింది. మొత్తం రెండు సెషన్లలో ప్రత్యేక ట్రేడింగ్‌ నిర్వహించగా.. ఇందులో సెన్సెక్స్‌ 88.91 పాయింట్లు లాభపడి 74,005.94 వద్ద, నిఫ్టీ 35.9 పాయింట్ల లాభంతో 22,502 వద్ద స్థిరపడ్డాయి.

దాదాపు అన్ని రంగాల షేర్లు రాణించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌, ఫార్మా, రియల్టీ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. నెస్లే ఇండియా, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, టాటా మోటర్స్‌ షేరు విలువ దాదాపు 2 శాతం పెరగ్గా.. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేరు విలువ పతనమైంది.

ఎందుకీ సెషన్‌..?

సాధారణంగా శనివారం మార్కెట్లు (Stock market) పనిచేయవు. కానీ, ప్రాథమిక సైట్‌లో ఏమైనా లోపాలు తలెత్తితే ఎదుర్కొనే సన్నద్ధతను పరీక్షించేందుకు శనివారం ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్‌ విభాగాల్లో ప్రత్యేక ట్రేడింగ్‌ సెషన్‌ను బీఎస్‌ఈ (BSE), ఎన్‌ఎస్‌ఈ (NSE) నిర్వహించాయి. రెండు సెషన్లలో ఈ ప్రత్యేక ట్రేడింగ్‌ కొనసాగింది.

మొదటి సెషన్‌ ఉదయం 9.15 గంటలకు ప్రారంభమై 10.15 గంటలకు.. రెండో సెషన్‌ 11.30 - 12.30 గంటల మధ్య ముగిసింది. తొలుత ప్రాథమిక సైట్‌లో.. తర్వాత డిజాస్టర్‌ రికవరీ సైట్‌లో ట్రేడింగ్‌ చేశారు. ఈ సమయంలో అన్ని సెక్యూరిటీస్‌, డెరివేటివ్‌ ఉత్పత్తులను ట్రేడింగ్‌ చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. గరిష్ఠ పరిమితిని 5 శాతంగా నిర్ణయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని